WI vs PAK : ఓట‌మి బాధ‌లో ఉన్న పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఇంక అంతే..

వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో పాకిస్థాన్‌కు (WI vs PAK) ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

Big Blow For Pakistan As Shan Masood Ruled Out Of 2nd Test vs West Indies

WI vs PAK : వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో పాకిస్థాన్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. తొలి టెస్టులో పాక్ ఘోరంగా ఓడిపోయింది. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 2 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదిక‌గా ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విజ‌యం సాధించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ బ్యాటర్ షాన్ మసూద్ వేలి గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో జేడెన్ సీల్స్ వేసిన బంతి ఎడమ చేతి చూపుడు వేలికి తగలడంతో మసూద్ గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

తొలి టెస్టు మ్యాచ్‌లో మ‌సూద్ తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం (109) చేయ‌గా రెండో ఇన్నింగ్స్‌లో 3 ప‌రుగులు చేశాడు.

ODI World Cup 2027 : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2027 వేదిక‌ల‌ను ఖ‌రారు చేసిన ఐసీసీ.. 12 స్టేడియాల్లో.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే?

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో జరిగిన తొలి టెస్టులో తన ఎడమ చేతి చూపుడు వేలికి గాయం కావడంతో పాకిస్థాన్ టెస్టు బ్యాటర్ షాన్ మసూద్ వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యాడు అని పీసీబీ తెలిపింది. అత‌డు ప్ర‌స్తుతం పాక్ జ‌ట్టు వైద్య బృందం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని తెలిపింది. అంతేకాదండోయ్ అత‌డు ఇంగ్లాండ్‌తో ఆగ‌స్టు 19 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు సైతం దూర‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు పేర్కొంది. ఆ టెస్టు స‌మ‌యం నాటికి అత‌డు కోలుకుంటే ఆడ‌తాడ‌ని తెలిపింది.

మసూద్ స్థానంలో అబ్దుల్లా షఫీక్, సౌద్ షకీల్‌, అవైస్ జాఫర్ ల‌లో ఒక‌రు బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. ఇప్పటివరకు 47 టెస్టులు ఆడిన షాన్ మసూద్ 2,765 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు 156.

ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) పట్టికలో పాకిస్థాన్ 9వ స్థానంలో ఉండగా, వెస్టిండీస్ 8వ స్థానంలో ఉంది.