IPL 2026 : ఐపీఎల్ ఆరంభానికి ముందే సీఎస్‌కేకు బిగ్ షాక్.. కీలక బౌలర్ దూరం
ఐపీఎల్ 2026 (IPL 2026) ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published On : March 19, 2026 / 07:05 PM IST
Big blow to CSK Nathan Ellis ruled out IPL 2026
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
- ఈ సీజన్ నుంచి తప్పుకున్న ఆసీస్ స్టార్ పేసర్
IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ నాథన్ ఎల్లిస్ ఈ మెగాటోర్నీ నుంచి తప్పుకున్నాడు. 31 ఏళ్ల ఆస్ట్రేలియా పేసర్ ఎల్లిస్ తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే సీఈఓ విశ్వనాథన్ తెలిపారు.
గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఇది నిజంగా మాకు పెద్ద షాక్. డెత్ ఓవర్లలో కీలక బౌలర్ అయిన ఎల్లిస్ దూరం అయ్యాడు. మేము ప్రత్యామ్నాయాల కోసం చేస్తున్నాము. ‘అని విశ్వనాథన్ అన్నారు.
Josh Hazlewood : ఆర్‌సీబీ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఈ సీజన్‌లో ఎన్ని మ్యాచ్‌లు ఆడడో తెలుసా?
ఎల్లిస్ దూరం కావడం సీఎస్‌కేకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చ. గత కొన్నాళ్లుగా సీఎస్‌కే డెత్ బౌలర్ల స్పెషలిస్ట్‌గా మతీష పతిరానా ఉన్నాడు. అయితే.. గత ఏడాది అతడు దారుణంగా నిరాశపరచడంతో అతడిని సీఎస్‌కే జట్టు వదిలివేసింది. ఇప్పుడు ఎల్లిస్ దూరం కావడంతో సీఎస్‌కే పేస్ విభాగం కాస్త బలహీనం పడినట్లే.
ఇదిలా ఉంటే.. మరో నాలుగు, ఐదు రోజుల్లో విదేశీ ఆటగాళ్ల కూడా జట్టుతో చేరతారని విశ్వనాథన్ తెలిపారు. డెవాల్డ్ బ్రెవిస్, మాట్ హెన్రీ, జాక్ ఫౌల్క్స్, మాథ్యూ షార్ట్ వంటి వారు మార్చి 22 నాటికి చేరనుండగా, అకీల్ హోసేన్ 25వ తేదీన చేరనున్నాడు. నూర్ అహ్మద్ ఇప్పటికే చేరుకోగా, జేమీ ఓవర్టన్ ఈ రాత్రికి చెన్నైకి చేరుకుంటాడని భావిస్తున్నారు.
