×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు భారీ షాక్‌.. బుమ్రా దూరం

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) యూఎస్ఏతో మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

Big Blow To Team India Ahead of USA match in T20 World Cup 2026

T20 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. భార‌త జ‌ట్టు త‌న తొలి మ్యాచ్‌ను శ‌నివారం యూఎస్ఏతో ఆడ‌నుంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. స్టార్ పేస‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా తీవ్ర జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో అత‌డు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు.

అత‌డి స్థానంలో.. హ‌ర్షిత్ రాణా స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన మ‌రో సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ ను తుది జ‌ట్టులో ఆడించేందుకు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. బుమ్రా శుక్ర‌వారం నిర్వ‌హించిన భార‌త ట్రైనింగ్ సెష‌న్‌కు హాజ‌రు కాలేదు.

ఫిట్‌గా 13 మందే..

వాస్త‌వానికి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 టోర్నీకి బీసీసీఐ 15 మంది స‌భ్యుల‌తో కూడిన భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. అయితే.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ ఇంకా జ‌ట్టుతో చేర‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు బెంగ‌ళూరులోని బీసీసీఐ సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్‌లో ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ఫిట్‌నెస్‌ను సాధించే ప‌నిలో ఉన్నాడు. సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ క్లియ‌రెన్స్ కోసం అత‌డు వేచి చూస్తున్నాడు.

T20 World Cup 2026 : సిరాజ్‌కు గోల్డెన్ ఛాన్స్‌.. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి హ‌ర్షిత్ రాణా ఔట్‌..

ఇక బుమ్రా కూడా వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతుండ‌డంతో ప్ర‌స్తుత జ‌ట్టులో 13 మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే ఫిట్‌గా ఉన్నారు.

ఓపెన‌ర్‌గా ఇషాన్ కిష‌నే..

యూఎస్ఏతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో ఇషాన్ కిష‌న్ ఓపెన‌ర్‌గా బ‌రిలోకి దిగుతాడ‌ని మ్యాచ్‌కు ముందు రోజు నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో టీమ్ఇండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు. ప్ర‌స్తుతం అత‌డు భీక‌ర ఫామ్‌లో ఉన్నాడ‌ని అన్నాడు. అత‌డి దూకుడైన బ్యాటింగ్ జ‌ట్టుకు ఎంతో ప్ర‌యోజ‌క‌రంగా ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు.

U19 World Cup 2026 : వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ఏం చెప్పాలో అర్థం కావ‌డం లేదు.. అత‌డొక‌.. ఆయుష్ మాత్రే కామెంట్స్ వైర‌ల్‌..

‘కివీస్‌తో టీ20 సిరీస్‌లో అత‌డు మూడో స్థానంలో ఆడాడు. వార్మ‌ప్ మ్యాచ్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. అత‌డు ఏ స్థానంలో ఆడినా దూకుడుగానే ఆడ‌తాడు. అత‌డు ఫ‌స్ట్ డౌన్ కంటే దిగువ స్థానంలో మాత్రం ఆడ‌డు.’ అని సూర్య‌కుమార్ యాద‌వ్ తెలిపాడు.

కివీస్‌తో టీ20 సిరీస్‌లో దారుణంగా విఫ‌ల‌మైన సంజూ శాంస‌న్ తుది జ‌ట్టులో స్థానం కోల్పోయాడు.