Saim Ayub : పాక్ క్రికెట‌రా.. మ‌జాకానా.. 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌.. స్టార్ ఆట‌గాడి ఇజ్జ‌త్ మొత్తం పాయె

9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌లో పాక్ స్టార్ క్రికెట‌ర్ సైమ్ అయూబ్ (Saim Ayub) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Big shame for Pakistan team as Saim Ayub gets dismissed by a 9 year old boy video viral

Saim Ayub : సైమ్ అయూబ్.. క్రికెట్ అభిమానుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం చేయాల్సిన ప‌ని లేదు. ఇటీవ‌ల కాలంలో పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు. 23 ఏళ్ల ఈ ఎడ‌మ చేతి వాటం ఆట‌గాడు ఇప్పటి వరకు పాక్ త‌రుపున‌ 8 టెస్టులు, 17 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 364 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 46.9 స‌గ‌టుతో 751 ప‌రుగులు చేశాడు. ఇందులో మూడు శ‌త‌కాలు, మూడు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. టీ20ల్లో 21.3 స‌గ‌టుతో 1298 ప‌రుగులు సాధించాడు. ఇందులో ఆరు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి.

కాగా.. గ‌త కొంత‌కాలంగా అత‌డు పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన పాకిస్థాన్ సూప‌ర్ లీగ్‌లోనూ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. 13 మ్యాచ్‌ల్లో 258 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. హైద‌రాబాద్ కింగ్స్ అత‌డిని 12.6 కోట్ల పాకిస్థానీ రూపాయ‌ల‌కు కొనుగోలు చేసింది. లీగ్‌లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా నిలిచాడు.

RCB : ఆర్‌సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే.. ఏం జ‌రుగుతుంది? ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తుందా?

పేల‌వ ఫామ్ కార‌ణంగా ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ కోసం 28 మందితో కూడిన వైట్ బాల్ శిక్ష‌ణ శిబిరంలో సైమ్ అయూబ్‌కు చోటు ద‌క్క‌లేదు. అంతేకాకుండా బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే టెస్టు జ‌ట్టులోనూ అత‌డికి చోటు ద‌క్క‌లేదు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ స్టార్ ఆట‌గాడు ఓ స్కూల్ పిల్లాడి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 9 ఏళ్ల జిదాన్ బ‌షీద్ అనే బాలుడు వేసిన బంతిని సైమ్ అయూబ్ డిఫెండ్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే.. బంతి అత‌డి బ్యాట్‌ను తాక‌లేదు. వికెట్ల‌ను ప‌డ‌గొట్టింది. అత‌డి బౌలింగ్ కు అయూబ్ షాక్ అయ్యాడు. నీకు మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని అంటూ స‌ద‌రు పిల్లాడిని మెచ్చుకున్నాడు.

Devdutt Padikkal : అరె బాబు.. ఈ గోల్డ్‌ చైన్ నీదేనా? ఆర్‌సీబీ ప్లేయ‌ర్ నిజాయ‌తీకి ఫ్యాన్స్ ఫిదా.. పిచ్ పై బంగారం దొర‌క‌గానే..

ఈ వీడియో వైర‌ల్‌గా మార‌గా సైమ్ అయూబ్ ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఉంటాయ్ పాక్ క్రికెట్ ప్ర‌మాణాలు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.