×
Ad

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు టీమ్ఇండియాకు భారీ షాక్.. స్టార్ పేస‌ర్‌కు గాయం..!

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు (T20 World Cup 2026) ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

Big shock to Team India Harshit Rana injured ahead of T20 World Cup 2026

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. బుధ‌వారం ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో స్టార్ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా గాయ‌ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో అత‌డు ఒకే ఒక ఓవ‌ర్ బౌలింగ్ చేశాడు. 16 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

అస‌లేం జ‌రిగిందంటే?

241 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు బ‌రిలోకి దిగింది. ఇన్నింగ్స్ 5వ ఓవ‌ర్‌ను హ‌ర్షిత్ రాణా వేశాడు. ఈ మ్యాచ్‌లో ఇది అత‌డికి తొలి ఓవ‌ర్‌. అయితే.. బౌలింగ్ చేసే క్ర‌మంలో ర‌న్ అప్ చేస్తుండ‌గా అత‌డు కొంత ఇబ్బంది ప‌డ్డాడు. ఈ ఓవ‌ర్‌లో రెండు సార్లు అత‌డు ఈ విధంగా ఇబ్బంది ప‌డ్డాడు. చివ‌రకు ఎలాగోలా ఓవ‌ర్ ను పూర్తి చేశాడు. ఆ త‌రువాత త‌న మోకాలిని ప‌ట్టుకుని క‌నిపించాడు. నొప్పి తీవ్రంగా ఉండ‌డంతో అత‌డు మ‌రో ఓవ‌ర్ వేయ‌కుండానే మైదానాన్ని వీడాడు.

Ishan Kishan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డి బౌలింగ్‌లో ఆడ‌లేను.. న‌న్ను బాగా ఇబ్బంది ప‌ట్టే బౌల‌ర్ అత‌నొక్క‌డే..

ఆ త‌రువాత అత‌డు మ‌ళ్లీ మైదానంలో క‌నిపించ‌లేదు. అత‌డి గాయం పై ఇప్ప‌టి వ‌ర‌కు బీసీసీఐ ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వ‌లేదు. ఒక‌వేళ అత‌డి గాయం తీవ్ర‌మైన‌ది అయి ప్ర‌పంచ‌క‌ప్‌కు అత‌డు దూరం అయితే అది భార‌త జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ‌గానే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే అత‌డు బౌలింగ్‌తో పాటు ఓ మోస్తరుగా ప‌రుగులు కూడా చేయ‌గ‌ల‌డు.

ఇంకా కోలుకోని వాషింగ్ట‌న్ సుంద‌ర్..

గ‌త నెల‌లో న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ గాయ‌ప‌డ్డాడు. అత‌డు ప‌క్క‌టెముక‌ల గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు కివీస్‌తో మిగిలిన వ‌న్డేల‌తో పాటు టీ20 సిరీస్‌కు దూరం అయ్యాడు. అత‌డు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం అత‌డు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్నాడు. అత‌డి స్థానంలో ఇంకా ఎవ‌రిని తీసుకోలేదు.

T20 World Cup : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టింది ఎవ‌రో తెలుసా? టాప్‌-5లో ఇద్ద‌రు టీమ్ఇండియా ప్లేయ‌ర్లు?

ఫిబ్ర‌వ‌రి 7న భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది. గ్రూప్ స్టేజీలో మ్యాచ్‌ల‌కు పెద్ద‌గా ఇబ్బంది లేక‌పోయిన‌ప్ప‌టికి కూడా సూప‌ర్‌-8 వ‌ర‌కు వాషింగ్ట‌న్ కోలుకుంటాడ‌ని అంతా భావిస్తున్నారు.