IND vs SL : భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్..
భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ (IND vs SL) తగిలింది.
- Thota Vamshi Kumar
- Published on- August 6, 2026 / 05:32 PM IST
Blow for Sri Lanka star player Kusal Mendis likely to miss 1st Test against India
IND vs SL : భారత్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు కుశాల్ మెండిస్ గాయం కారణంగా భారత్‌తో ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. 31 ఏళ్ల ఈ ఆటగాడు లంక ప్రీమియర్ లీగ్ 2026 సందర్భంగా గాయపడ్డాడు.
జూలై 19న తొడ కండరాల గాయం బారిన పడడంతో లంక ప్రీమియర్ లీగ్ మధ్యలోనే అతడు ఈ టోర్నీని వీడాడు. భారత్‌తో టెస్టు సిరీస్ నాటికి అతడు కోలుకుంటాడని లంక సెలక్టర్లు భావించారు. అయితే.. అతడు పూర్తిగా కోలుకోలేదని, ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉందని లంక మీడియాలో వార్తలు వస్తున్నాయి.
IND vs SL : శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్‌తో భారత్ వార్మప్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
కుశాల్ మెండిస్ తొలి టెస్టుకు దూరం అయితే.. అది లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. సొంత గడ్డపై అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటి వరకు స్వదేశంలో 59 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 41.49 సగటుతో 2365 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా 75 టెస్టుల్లో 139 ఇన్నింగ్స్‌ల్లో 4836 పరుగులు సాధించాడు.
ఒకవేళ అతడు తొలి టెస్టుకు దూరం అయితే.. అతడి స్థానంలో నిషాన్ మదుష్క వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది.
కాగా.. భారత్‌తో టెస్టు సిరీస్ ఇప్పటి వరకు శ్రీలంక క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించలేదు.
