IND vs SL : శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్‌తో భారత్ వార్మప్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య (IND vs SL) రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది
Do you know where to watch IND vs SL warm up match
IND vs SL : ఆగస్టు 15 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కన్నా ముందు శుక్రవారం నుంచి శ్రీలంక ఎలెవన్ జట్టుతో మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌ను భారత్ ఆడనుంది. కొలంబోలోని క్రికెట్ క్లబ్ మైదానంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.
భారత్, శ్రీలంక టెస్టు సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే వార్మప్ మ్యాచ్ సైతం స్టార్ స్పోర్ట్స్ చానల్లో ప్రత్యక్షప్రసారం కానుంది.
లంక జట్టు ప్రకటన..
భారత్‌తో వార్మప్ మ్యాచ్ కోసం 15 మందితో కూడిన శ్రీలంక ఎలెవన్ జట్టును లంక సెలక్టర్లు ప్రకటించారు. సోనల్ దినూష నాయకత్వంలో జట్టు బరిలోకి దిగనున్నట్లు వెల్లడించింది. ప్రధాన జట్టులో చోటు దక్కించుకోవడానికి పోటీ పడుతున్న ఏడుగురు ఆటగాళ్లు.. కెప్టెన్ సోనల్ దినూష, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, రమేశ్ మెండిస్, నిషాన్ మదుష్క, పవన్ రత్నాయకే, అంజల బండార లు వార్మప్ టీమ్‌లో ఉన్నారు.
Gautam Gambhir : శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు గంభీర్ హెచ్చరిక.. ప్రతి సవాల్‌కు..
ఇక ఇటీవల ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ దిలుమ్ సుధీర, ఐదు వికెట్లు తీసిన కేసర నువాంత వంటి ఆటగాళ్లు కూడా వార్మప్ జట్టులో చోటుదక్కించుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం శ్రీలంక క్రికెట్ బోర్డు ఇంకా తమ జట్టును ప్రకటించలేదు.
