Yuzvendra Chahal : విడాకుల వార్తల వేళ.. మిస్టరీ గర్ల్‌తో చాహల్..! ఎవరా అమ్మాయి..?
టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Chahal spotted with mystery girl outside mumbai hotel
Yuzvendra Chahal Spotted With Mystery Girl : టీమ్ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, అందుకనే గత కొన్ని రోజులుగా వారు విడివిడిగా ఉంటున్నారని అంటున్నారు. కాగా.. ధనశ్రీ, చాహల్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని మరొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
అదే సమయంలో ధనశ్రీకి సంబంధించిన ఫోటోలను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడం కూడా ఆ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే.. ధనశ్రీ వర్మ మాత్రం చాహల్ ఫోటోలను తొలగించకపోవడం గమనార్హం. ఓ వైపు విడాకుల వార్తలపై అటు ధనశ్రీ, ఇటు చాహల్ లు ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలో చాహల్ ఓ మిస్టరీ గర్ల్‌తో కనిపించాడని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Mohammad Kaif : ఫిబ్రవరి 23న టీమ్ఇండియా పై ప్రశంసల వర్షం.. మహ్మద్ కైఫ్ కామెంట్స్ వైరల్..
ముంబైలోని ఓ హోటల్ వద్ద ఓ అమ్మాయితో కలిసి కారులో చాహల్ కనిపించాడు. వీడియో కెమెరాలు అతడిని బంధించేందుకు ప్రయత్నించగా చాహల్ తన ముఖాన్ని చేతితో కవర్ చేసుకున్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ఆ ఫోటోలు, వీడియోల్లో చాహల్ తెల్లటి ఓవర్ సైజ్ టీ-షర్ట్, బ్యాగీ లేత నీలం రంగు జీన్స్‌లో ధరించి ఉన్నాడు. దీంతో.. ఈ మిస్టరీ గర్ల్ కారణంగానే చాహల్, ధనశ్రీ వర్మలు విడిపోతున్నారా అనే చర్చ మొదలైంది. మిస్టరీ గర్ల్ ఎవరా అని తెలుసుకునే పనిలో ఉన్నారు నెటిజన్లు.
ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ డెంటిస్ట్, కొరియోగ్రాఫర్. డ్యాన్స్ క్లాసులకు చాహల్ ఆమె వద్దకు వెళ్లేవాడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. 2020 డిసెంబర్ 11న వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.
కాగా.. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చాహల్ పై కోట్ల వర్షం కురిసింది. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది.
View this post on Instagram