IND-w vs IRE-w : మ‌రో నాలుగు రోజుల్లో ఐర్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. స్టార్ పేసర్, కెప్టెన్‌కు విశ్రాంతి..

ఐర్లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టుతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది.

IND-w vs IRE-w : మ‌రో నాలుగు రోజుల్లో ఐర్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌.. జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. స్టార్ పేసర్, కెప్టెన్‌కు విశ్రాంతి..

BCCI announces India ODI squad for for Ireland Series

Updated On : January 6, 2025 / 1:17 PM IST

ఐర్లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టుతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. స్వ‌దేశంలో జ‌న‌వ‌రి 10 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సిరీస్‌లో పాల్గొనే భార‌త మ‌హిళ‌ల జ‌ట్టును భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. 15 మంది స‌భ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. ఈ సిరీస్‌కు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌తో పాటు సీనియ‌ర్ పేస‌ర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ల‌కు విశ్రాంతి ఇచ్చింది.

రెగ్యుల‌ర్ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ గైర్హాజ‌రీలో స్టార్ బ్యాట‌ర్ స్మృతి మంధాన జ‌ట్టుకు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నుంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ దీప్తిశ‌ర్మ ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఇటీవ‌ల వెస్టిండీస్‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో అరంగ్రేటం చేసిన ప్ర‌తికా రావ‌ల్ అద‌ర‌గొట్టింది. మూడు వ‌న్డేల్లో ఈ యువ ఓపెన‌ర్ 44.7 స‌గ‌టుతో 134 ప‌రుగులు సాధించింది. ఇందులో ఓ హాఫ్ సెంచ‌రీ కూడా ఉంది.

Champions Trophy 2025 : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి భార‌త జ‌ట్టును బీసీసీఐ ఎప్పుడు ప్ర‌క‌టించ‌నుంది? ఆ రోజేనా?

ఈ క్ర‌మంలో ఈ యువ బ్యాట‌ర్ త‌న స్థానాన్ని నిల‌బెట్టుకుంది. అయితే.. స్టార్ ష‌ఫాలీ వ‌ర్మను ఈ సిరీస్‌కు ఎంపిక చేయ‌లేదు.

భార‌త్ వ‌ర్సెస్ ఐర్లాండ్ మ‌హిళ‌ల వ‌న్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..

తొలి వ‌న్డే – జ‌న‌వ‌రి 10న‌
రెండో వ‌న్డే – జ‌న‌వ‌రి 12న‌
మూడో వ‌న్డే – జ‌న‌వ‌రి 15న
ఈ మూడు వ‌న్డే మ్యాచులు రాజ్‌కోట్‌లోని నిరంజ‌న్ షా స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి.

Steven Smith : పాపం స్టీవ్ స్మిత్ .. ఆస్ట్రేలియా గెలిచినా ద‌క్క‌ని ఊర‌ట‌.. లంక‌లో అయినా..

ఐర్లాండ్‌తో వ‌న్డే సిరీస్‌కు భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఇదే..
స్మృతి మంధాన (కెప్టెన్‌), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, ఉమా చెత్రీ (వికెట్ కీప‌ర్‌), రిచా ఘోష్ (వికెట్ కీప‌ర్‌), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టైటాస్ సాధు , సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే.