Viral video : గ‌ల్లీ క్రికెట్‌లో మోసం.. ఏంటి చిన్నా ఇదీ.. చూడు బ్యాట‌ర్ ఎంత‌గా ఫీల్ అయ్యాడో.. నిజం చెప్పొద్దు

గ‌ల్లీ క్రికెట్‌లో జ‌రిగే కొన్ని మోసాలు వినోదాన్ని పంచుతుంటాయి.

Cheating in Gully Cricket video viral

Viral video : క్రికెట్‌ను జెంటిల్‌మ‌న్ గేమ్ అని అంటారు. అయితే.. ఈ గేమ్‌లో కొన్ని సార్లు మోసం చేసిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. టెస్టులు, టీ20లు, వ‌న్డేల్లో, లీగుల్లో కొంద‌రు క్రికెట‌ర్లు ఫికింగ్స్‌ ల‌కు పాల్ప‌డిన ఉదంతాలు ఉన్నాయి. శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకె బుధవారం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్టయ్యాడు. ఆయన్ను స్పోర్ట్స్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అరెస్ట్ చేసింది. సేనానాయకే 2020 ఎడిషన్ లంక ప్రీమియర్ లీగ్ (LPL)లో మ్యాచ్‌ల‌ను ఫిక్స్ చేయాల‌ని ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌పై ఒత్తిడి తెచ్చాడు.

అయితే.. గ‌ల్లీ క్రికెట్‌లో జ‌రిగే కొన్ని మోసాలు వినోదాన్ని పంచుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈవీడియోలో కొంద‌రు చిన్నారులు క్రికెట్ ఆడుతుంటారు. బౌల‌ర్ బాల్ వేయ‌గా బ్యాట‌ర్ ముందుకు వెళ్లి భారీ షాట్ ఆడాల‌ని ప్ర‌య‌త్నించాడు.

ICC : బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ భారీ షాక్‌.. రెండేళ్ల పాటు నిషేదం.. ఎందుకంటే..?

అయితే.. ఆ బాల్ బ్యాట్ తాక‌కుండా వెన‌క్కి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో కావాల‌ని వికెట్ కీప‌ర్ ఓ వికెట్‌ను త‌న చేతుల‌తో కింద పడేస్తాడు.

అత‌డితో పాటు మిగిలిన వారంద‌రూ ఔట్ అంటూ ఆనందంతో సంబురాలు చేసుకోగా.. ఈ విష‌యం తెలియ‌ని స‌ద‌రు బ్యాట‌ర్ నిజంగానే తాను ఔట్ అయ్యాన‌ని భావించి నిరాశ‌ను వ్య‌క్తం చేస్తాడు. త‌న బ్యాట్‌తో గాలిలో కొట్టాడు. అనంత‌రం బ్యాట్‌ను కింద‌ప‌డేసి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ఇది ఎప్పుడు ఎక్క‌డ జ‌రిగింది అనే విష‌యాలు తెలియ‌న‌ప్ప‌టికీ వీడియో మాత్రం వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.

MS Dhoni : ధోనిని క‌లిసిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్‌.. ‘అప్పుడు ఓ ఆట‌గాడిగా ఇష్ట‌ప‌డేదాన్ని కానీ ఇప్పుడు..’

ట్రెండింగ్ వార్తలు