Cheteshwar Pujara
Cheteshwar Pujara: భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ ఛతేశ్వర్ పూజారా ఇంగ్లాండ్ గడ్డపై కౌంటీల్లో రికార్డుల మోత మోగించేస్తున్నాడు. సస్సెక్స్ టీమ్‌కి ఆడుతున్న ఛతేశ్వర్ పూజారా తాజాగా మిడిల్‌సెక్స్ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో చతేశ్వర్ పుజారాకి ఇది 16వ డబుల్ సెంచరీకాగా.. సస్సెక్స్ తరఫున తాజా సీజన్‌లో ఇది మూడో డబుల్ సెంచరీ కావడం గమనార్హం. సింగిల్ సీజన్‌లో సస్సెక్స్ తరపున 118 ఏళ్లలో ఏ ప్లేయర్ కూడా ఇలా మూడు డబుల్ సెంచరీలు నమోదు చేయలేకపోయారు.
125 ఏళ్ల క్రితం ఇదే మైదానంలో సస్సెక్స్ తరపున రంజిత్ సింగ్‌జీ డబుల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్థాయిలో డబుల్ సెంచరీలు చేసిన క్రికెటర్లలో పూజారా సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. పూజారాతో పాటు సీబీ ఫ్రై, జాక్ హోబ్స్, గ్రేమీ హిక్ ఐదో స్థానంలో ఉన్నారు.
Read Also: కోహ్లీ కావాలని ఎవరినీ కించపరచలేదు: పూజారా
డబుల్ సెంచరీలు అత్యధికంగా కొట్టిన ప్లేయర్లలో ఆస్ట్రేలియా క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ 37 సార్లు డబుల్ సెంచరీ చేసి ప్రథమస్థానంలో నిలిచాడు. ఆ లిస్టులో వాల్టర్ హమ్మాండ్ 36 సార్లు డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక 22 డబుల్ సెంచరీలతో మూడో స్థానంలో ఎలియాస్ హెండ్రిన్ ఉన్నారు.