Chris Gayle: వార్నర్ జేబులు వెతికిన క్రిస్ గేల్.. బాల్ ట్యాంపరింగ్!!
విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ బయటికొచ్చాడంటే వార్తల్లో ఉండాల్సిందే. గ్రౌండ్ లో ఉన్నంతసేపు ఏదో ఒకటి చేస్తూ సందడి చేస్తుంటాడు. రీసెంట్ గా శనివారం ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్
- Subhan Ali Shaik
- Published On : November 7, 2021 / 01:43 PM IST
Ball Tampering
Chris Gayle: విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ బయటికొచ్చాడంటే వార్తల్లో ఉండాల్సిందే. గ్రౌండ్ లో ఉన్నంతసేపు ఏదో ఒకటి చేస్తూ సందడి చేస్తుంటాడు. రీసెంట్ గా శనివారం ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లోనూ అలాగే జరిగింది. బరిలోకి దిగి రెండు సిక్సులు బాది 15స్కోరుతో డ్రెస్సింగ్ రూం చేరుకున్నాడు.
ఆ తర్వాత ఒక ఓవర్ బౌలింగ్ వేసి మిచెల్ మార్ష్ వికెట్ పడగొట్టాడు. వెంటనే అతని దగ్గరకు వెళ్లి అవుట్ అయిపోయినందుకు థ్యాంక్స్ అని చెప్పాడు. అక్కడితో ఆగకుండా డేవిడ్ వార్నర్ ను కూడా డిస్ట్రబ్ చేశాడు. స్టేడియంలో ఉన్న వారి అటెన్షన్ మొత్తాన్ని తిప్పేసుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెళ్లి అతని జేబులు వెదికాడు.
సరదాగా చేసిన ఈ సీన్ క్షణాల్లో వైరల్ అయింది. దీనిని ఇంగ్లాండ్ బర్మీ ఆర్మీ పోస్టు చేయడంతో 11వేల మంది లైక్ కొట్టేశారు. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదంతో డేవిడ్ వార్నర్ అప్పట్లో వార్తల్లోకెక్కిన విషయం తెలిసింది. ఆ కారణంగా రెండేళ్లపాటు నిషేదాన్ని కూడా ఎదుర్కొన్నాడు.
………………………………………. : ఆర్టీసీ ఛార్జీల పెంపు..సంస్థ ప్రతిపాదనలివే
ఈ మ్యాచ్ తో వెస్టిండీస్ ఆడిన ఐదింటిలో నాలుగు పరాజయాలు మూటగట్టుకుంది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో వార్నర్ 56బంతుల్లో 89పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ కనబరిచాడు.
Has Chris Gayle just checked Warner's pocket for sandpaper ??#T20WorldCup pic.twitter.com/QUMM1ylFqp
— England's Barmy Army (@TheBarmyArmy) November 6, 2021
