Telangana : ఆర్టీసీ ఛార్జీల పెంపు..సంస్థ ప్రతిపాదనలివే

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

Telangana : ఆర్టీసీ ఛార్జీల పెంపు..సంస్థ ప్రతిపాదనలివే

tsrtc-

RTC Bus Charges Hike : త్వరలోనే తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ సంస్థ నిర్ణయానికి వచ్చింది. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం ఛార్జీలు పెంచాలని ప్రతిపాదనలు చేసింది. పల్లె వెలుగు బస్సుకు కిలోమీటర్ కు 25 పైసలు, అలాగే ఎక్స్ ప్రెస్..ఆ పై సర్వీసులకు 30 పైసలు…సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసల చొప్పున..మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 చొప్పున పెంచాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా ? లేదా ? అనేది చూడాలి.

Read More  : Papikondalu : బోట్ల షికారు అంతా శుభం జరగాలి – మంత్రి అవంతి శ్రీనివాస్

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఛార్జీల పెంపు ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై తెలంగాణ కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతుంది… కిలోమీటరుకు 10 పైసల నుంచి 25 పైసలు పెంచాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ఆర్టీసీ. పెరిగిన డీజిల్‌ భారం నుంచి బయట పడాలంటే చార్జీలు స్వల్పంగా పెంచడం తప్పదంటోంది ఆర్టీసీ యాజమాన్యం.
ఛార్జీల పెంపుపై ఆర్టీసీ అధికారులు నేరుగా సీఎంకు పరిస్థితిని వివరించారు.

Read More  : Heavy Rains : నీట మునిగిన నెల్లూరు, చిత్తూరులో వర్ష బీభత్సం

వచ్చే కేబినెట్ మీటింగ్‌లోగా ప్రతిపాదనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో ఏ మేర పెంచితే.. ఎంత మేర నష్టం భర్తీ అవుతుందనే అంశం పైన సీఎంఓకు రిపోర్ట్ ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. రెండు రోజుల్లో ఈ ఫైల్‌ సీఎం కేసీఆర్‌ వద్దకు చేరుకోనుంది. ఆ తర్వాత కేబినెట్‌లో చర్చించి ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడుతోంది. దీనికి కరోనా కష్టాలు కూడా తోడయ్యాయి. రెండేళ్లలో 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో.. చార్జీలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. దీనిపై.. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.