Papikondalu : బోట్ల షికారు అంతా శుభం జరగాలి – మంత్రి అవంతి శ్రీనివాస్

కార్తీక మాసంలో ప్రారంభమైన బోట్ల షికారు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్లు, ప్రస్తుతం 11 బోట్లకు ఫర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

Papikondalu : బోట్ల షికారు అంతా శుభం జరగాలి – మంత్రి అవంతి శ్రీనివాస్

Papikondalu

Papikondalu Boat Ride : కార్తీక మాసంలో ప్రారంభమైన బోట్ల షికారు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్లు, ప్రస్తుతం 11 బోట్లకు ఫర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం…భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, టూరిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా…పోలీసులు, టూరిజం, ఇరిగేషన్ అధికారులు సిబ్బంది సహకరిస్తాన్నారు. 2021, నవంబర్ 07వ తేదీ ఆదివారం పోచమ్మగండి నుంచి పాపికొండల పర్యాటక బోట్లను పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా..మీడియాతో మాట్లాడారు.

Read More : T20 World Cup 2021: నలుగురు అఫ్ఘాన్ల చేతిలో టీమిండియా సెమీస్ ఆశలు

శాటిలైట్ సిస్టంతో చిన్న పిల్లల దగ్గరి నుంచి ప్రయాణీకులందరూ..లైఫ్ జాకెట్స్ ధరించాలన్నారు. టూరిజం సిబ్బందికి సహకరించాలని సూచించారు. విమానం ఎక్కిన సమయంలో..ఏ విధంగా సీట్ బెల్టు పెట్టుకుంటారో..అదే విధంగా…బోటు ఎక్కి దిగే వరకు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, మిగిలిన బోట్లకు త్వరలోనే ఫర్మిషన్ ఇస్తామన్నారు. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించడం జరిగిందని, పోలవరం అనేది ప్రజల జీవనాడిగా అభివర్ణించారు.

Read More : Anantapur : కొడుకు పెళ్ళైన కొద్ది నిమిషాలకే తండ్రి మృతి

2019లో కచ్చులూరు బోటు ప్రమాదం తర్వాత పాపికొండల యాత్రను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అనుమతి ఇచ్చింది. కేవలం 11 బోట్లకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిలో 2 టూరిజం బోట్లు, 9 ప్రైవేటు బోట్లు ఉన్నాయి. సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి పోచమ్మగండికి తిరిగి వచ్చేలా పేరాలంటాపల్లిలో ఉండే సమయాన్ని కుదించింది. తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు.

Read More : Heavy Rains : నీట మునిగిన నెల్లూరు, చిత్తూరులో వర్ష బీభత్సం

పర్యాటకులు ముందుగా రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా APTDC వెబ్‌సైట్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి 12 వందల 50 రూపాయలు చెల్లించాలి. అటు పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది.