Heavy Rains : నీట మునిగిన నెల్లూరు, చిత్తూరులో వర్ష బీభత్సం

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు.

Heavy Rains : నీట మునిగిన నెల్లూరు, చిత్తూరులో వర్ష బీభత్సం

Heavy Rain

Heavy Rains Updates : నెల్లూరు నీట మునిగింది. నాలుగు రోజులుగా కుండపోత వర్షం కురుస్తుండడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వర్ష బీభత్సంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు టౌన్ లోకి నీళ్లు చేరడంతో..ఇళ్లలోకి భారీగా నీరు చేరిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు తడిసిపోవడంతో..ప్రజలు అవస్థలు పడ్డారు. సమాచారం తెలుసుకున్న మంత్రి అనీల్ కుమార్..వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రహదారులపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోవడంతో..వాహనాలు నిలిచిపోయాయి. నీళ్లు నిలవకుండా…అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Read More : Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి రెండు గంటల సమయం

జిల్లా వ్యాప్తంగా..సరాసరి…24.01 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాపోరు మండలంలో 78.2 మిల్లీమీటర్లు, కనిగిరిలో 70.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రాబోయే రోజు   ఐదు రోజుల పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తీర ప్రాంతాల్లో మత్స్యకారులందరూ ఈనెల 13 వరకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. రాబోయే మూడు రోజుల్లో అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.

Read More : Gold Price Today : భారీగా పెరిగిన బంగారం ధరలు.. మూడు నెలల గరిష్ఠానికి జంప్

సముద్రమట్టానికి 8.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని, దీని కారణంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 09వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని, క్రమేపి బలపది వాయువ్య దిశగా..పయనిస్తుందని తెలిపారు. ఈనెల 11, 12వ తేదీల్లో దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తా తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు.

Read More : Just missed: ప్రధానికి తృటిలో తప్పిన ప్రమాదం

తిరుపతిలో వర్ష బీభత్సం : –
తిరుపతిలో కూడా సేమ్ ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలోని ప్రతి కూడలి చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. 2021, నవంబర్ 06వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటల నుంచి వర్షం కురుస్తోంది. వాహనాలను నీట మునిగిపోయాయి. తిరుమలకు వెళ్లే దారిలో నీట నిలవడంతో..శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. లక్ష్మీపురం సర్కిల్ లో కాల్వలు పొంగి ప్రవహిస్తుండడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి.

Read More : Telangana Wine Shops: వైన్ షాపులకు టెండర్లు షురూ!

భారీ వర్షానికి నవ వధువు మృత్యువాత పడిందని తెలుస్తోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి ఉన్న ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో తమిళనాడులోనూ… 10, 11, 12 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలోనూ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 9 లోపు తీరప్రాంతాలకు చేరుకోవాలని స్పష్టం చేసింది.