Anantapur : కొడుకు పెళ్ళైన కొద్ది నిమిషాలకే తండ్రి మృతి
అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి పూర్తైన కొద్దీ సేపటికే తండ్రి మృతి చెందాడు

Anantapur
Anantapur : అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొడుకు పెళ్లి పూర్తైన కొద్దీ సేపటికే తండ్రి మృతి చెందాడు.. అది విని తల్లి ప్రాణాలు విధించింది.. ఈ ఘటన జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడులో చోటుచేసుకుంది. పామిడి ఏఎస్ఐగా పనిచేస్తున్న వెంటకస్వామి కుమారుడి వివాహం ఆదివారం ఉదయం జరిగింది.
చదవండి : Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వివాహం జరిగిన వెంటనే వెంకటస్వామి గుండెపోటుతో మృతి చెందాడు.. కొడుకు మరణవార్త విన్న తల్లి కొనమ్మ (70) అక్కడిక్కక్కడే కుప్పకూలి మృతి చెందింది. పెళ్లింట్లో తల్లి, కొడుకు మృతి చెందటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
చదవండి : Anantapur : తన పోలికలు లేవని పసిబిడ్డను హతమార్చిన తండ్రి