Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి దగ్గర జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

Anantapur Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

5 Died In Massive Road Accident In Anantapur District

Anantapur Road accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పామిడి దగ్గర జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా గార్లదిన్నె మండలంలోని కొప్పలకొండకు చెందిన వారిగా గుర్తించారు. చనిపోయిన వారు, గాయపడిన వారంతా వ్యవసాయ కూలీలు. రోజూ పని కోసం వివిధ గ్రామాలకు వెళ్తుంటారు. ఇవాళ కూడా పత్తి తీయడానికి ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దాంతో కూలీల కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. మృతుల్లో శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి‍‌(40)గా గుర్తించారు. ప్ర‌మాదంలో లారీ ఢీకొట్టిన ఆటో నుజ్జునుజ్జ‌య్యింది. మృతదేహాలన్నీ రోడ్డు ప‌క్క‌న‌ చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృతిదేహాల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని వివ‌రాలు సేక‌రిస్తున్నారు. లారీ డ్రైవర్‌ తప్పిదం కారణంగానే ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

తెల్లవారు జామున ఆటో అతి వేగంగా వెళ్తుండగా.. మంచు ఎక్కువగా ఉండడంతో ఎదురుగా వచ్చే లారీ కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.. ఆటోను ఢీ కొట్టిన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు అనంతపురం జిల్లాలోనే మిడుతూరులోనూ ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మిడుతూరు నేష‌న‌ల్ హైవేపై కారు పాదాచారులపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో యాకోబ్‌ (62), నారాయణ (60) వ్యక్తులు మృతి చెందారు. అనంతపురం జిల్లాలో జ‌రిగిన‌ రోడ్డు ప్రమాదాల్లో.. ఏడుగురు మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని అనంతపురం ఆసుపత్రిలో రాష్ట పాఠశాలల విద్యా కమీషన్ చైర్మన్, శింగనమల ఎమ్మెల్యే భర్త సాంభశివారెడ్డి పరామర్శించారు.
Read Also : Hyderabad : గోల్నాకలో భారీ అగ్నిప్రమాదం