Mumbai Indians : వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. ప్లేఆఫ్స్‌కు ముంబై ఎలా అర్హ‌త సాధించ‌వ‌చ్చో తెలుసా?

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్(Mumbai Indians,) వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది

Consistently 4 matches lost Do you know Mumbai Indians have still chance to Qualify For IPL 2026 Playoffs (Pic credit@IPL)

  • ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయిన ముంబై ఇండియ‌న్స్‌
    ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానం
    అయినా గానీ ముంబై ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంది

Mumbai Indians : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియ‌న్స్‌కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. తొలి మ్యాచ్‌లో విజ‌యం సాధించిన ముంబై జ‌ట్టు ఆ త‌రువాత వ‌రుస‌గా ఓట‌ముల‌ను చ‌విచూస్తోంది. గురువారం వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు చేతిలో ముంబై ప‌రాజ‌యం పాలైంది. ఈ సీజ‌న్‌లో ముంబైకి ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ అవ‌కాశాలపై ఇప్పుడు అంద‌రి దృష్టి ప‌డింది.

ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ముంబై జ‌ట్టు ఐదు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌గా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రెండు పాయింట్లు ఆ జ‌ట్టు ఖాతాలో ఉండ‌గా నెట్‌ర‌న్‌రేటు -1.076గా ఉంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు తొమ్మిదో స్థానంలో ఉంది.

Alsor read : నేటి నుంచే భార‌త్, ద‌క్షిణాఫ్రికా మ‌హిళ‌ల టీ20 సిరీస్‌.. ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

ముంబై ప్లే ఆఫ్స్ కు ఎలా అర్హ‌త సాధిస్తుంది ?

ఈ సీజ‌న్‌లో కూడా ముంబై ఇండియ‌న్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హ‌త సాధించే అవ‌కాశం ఉంది. గ‌త సీజ‌న్ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే 16 పాయింట్లు సాధించిన జ‌ట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అంటే.. ముంబై 16 పాయింట్ల‌కు చేరుకుంటే ప్లేఆఫ్స్ ఆడ‌నుంది. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఇంకా 14 పాయింట్లు కావాల్సి ఉంది.

14 పాయింట్లు రావాలంటే ఆ జ‌ట్టు ఇంకో ఏడు మ్యాచ్‌ల్లో గెల‌వాల్సి ఉంది. ముంబై జ‌ట్టు ఈ సీజ‌న్‌లో ఇంకో 9 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది ఇందులో 7 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హ‌త సాధిస్తుంది. అలా కాకుండా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఆ జ‌ట్టు ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే.