IND-W vs SA-W : నేటి నుంచే భారత్, దక్షిణాఫ్రికా మహిళల టీ20 సిరీస్.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ (IND-W vs SA-W )ప్రారంభం కానుంది.
Do you know where to watch IND-W vs SA-W T20I series 2026
- నేడు భారత్ వర్సెస్ దక్షిణాప్రికా మహిళల మధ్య తొలి టీ20 మ్యాచ్
- ఆతిథ్యం ఇస్తున్న డర్బన్
- గెలిచి సిరీస్‌లో శుభారంభాన్ని పొందాలని ఇరు జట్ల ఆకాంక్ష
IND-W vs SA-W : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య నేటి నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్‌కు డర్బన్ ఆతిథ్యం ఇస్తోంది. టీ20 ప్రపంచకప్ 2026కి సన్నాహకంగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ సిరీస్ ద్వారా ప్లేయర్లు అందరికి అవకాశాలు ఇచ్చి.. జట్టు కూర్పును పరీక్షించుకోవాలని భారత్ భావిస్తోంది.
ఈ సిరీస్‌లో అందరి దృష్టి 22 ఏళ్ల ఆల్‌రౌండర్ అనుష్క శర్మ పైనే ఉంది. దేశవాళీ క్రికెట్, డబ్ల్యూపీఎల్‌లో అదరగొట్టిన ఈ ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ దక్షిణాఫ్రికా పై ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని పిచ్‌లు ఎక్కువగా పేసర్లకు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎక్కువ మంది పేసర్లకు జట్టులో స్థానం దక్కవచ్చు.
also read : చరిత్ర సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్లో సెంచరీ..
ప్రోటీన్ మహిళల జట్టుకు లారా వోల్వార్డ్ సారథ్యం వహించనుండగా భారత మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు.
సిరీస్ షెడ్యూల్ ఇదే..
* తొలి టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 17న – కింగ్స్ మీడ్ (డర్బన్)
* రెండో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 19న – కింగ్స్ మీడ్ (డర్బన్)
* మూడో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 22న – వాండరర్స్ స్టేడియం (జోహెన్నెస్ బర్గ్)
* నాలుగో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 25న – వాండరర్స్ స్టేడియం (జోహెన్నెస్ బర్గ్)
* ఐదో టీ20 మ్యాచ్ – ఏప్రిల్ 27న – విల్లోమూర్ పార్క్ (బెనోని)
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కష్వీ గౌతమ్, భారతీ ఫుల్మాలి, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అనుష్క శర్మ
ఎక్కడ చూడొచ్చంటే..?
ఈ మ్యాచ్‌లు అన్ని భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి. సౌతాఫ్రికా దేశంలో సూపర్ స్టోర్ట్స్ క్రికెట్ ఛానెల్లో ప్రత్యక్షప్రసారం కానుంది. సూపర్ స్టోర్ట్స్ క్రికెట్ వైబ్‌సైట్, యాప్‌లలో చూడొచ్చు. ఇక భారతదేశంలో ఈ సిరీస్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ కలిగి ఉంది. దీంతో టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో మ్యాచ్‌ను వీక్షించవచ్చు. ఇక ఓటీటీలో అయితే.. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి.
