Copa America 2024 : కోపా అమెరికా 2024 విజేత‌గా అర్జెంటీనా.. ఫైన‌ల్‌లో కొలంబియా పై విజ‌యం.. ఆనందంలో మెస్సీ

కోపా అమెరికా 2024 టోర్నీ విజేత‌గా అర్జెంటీనా నిలిచింది.

Copa America 2024 Argentina beats Colombia to lift record 16th title

Copa America 2024 winner Argentina : కోపా అమెరికా 2024 టోర్నీ విజేత‌గా అర్జెంటీనా నిలిచింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున జ‌రిగిన కోపా అమెరికా ఫైన‌ల్ మ్యాచ్‌లో కొలంబియాను 1-0 తేడాతో ఓడించింది. దీంతో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 16వ సారి కోపా అమెరికా క‌ప్‌ను ముద్దాడింది.

ఫైన‌ల్ మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠ‌గా సాగింది. మ్యాచ్ నిర్ణీత స‌మ‌యం అన‌గా 90 నిమిషాల స‌మ‌యంలో ఇరు జ‌ట్లు గోల్స్ చేయ‌డంలో చేయ‌డంలో విఫ‌లం అయ్యాయి. దీంతో 30 నిమిషాల అద‌న‌పు స‌మ‌యాన్ని ఇచ్చారు. ఈ స‌మ‌యంలోనూ ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు గోల్స్ చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. స‌మ‌యం ముగిసిపోతుండ‌డంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ దారి తీస్తుంద‌ని అభిమానులు భావించారు.

Euro Cup 2024 : యూరో క‌ప్ విజేత‌గా స్పెయిన్‌.. ఇంగ్లాండ్‌కు మ‌ళ్లీ నిరాశే..

స‌రిగ్గా అదే స‌మ‌యంలో 112వ నిమిషంలో లౌటరో జేవియర్ మార్టినెజ్ అద్భుతం చేశాడు. త‌న జ‌ట్టుకు గోల్ అందించాడు. దీంతో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. మ‌రో 8 నిమిషాల పాటు త‌న ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వ‌చ్చిన అర్జెంటీనా విజేత‌గా నిలిచింది. కోపా అమెరికా క‌ప్‌ను అర్జెంటీనా సాధించ‌డం ఇది 16వ సారి. ఈ క్ర‌మంలో 15 సార్లు నెగ్గిన ఉరుగ్వే రికార్డును అర్జెంటీనా అధిగ‌మించింది.

ఇదిలా ఉంటే.. అర్జెంటీనా కెప్టెన్‌, స్టార్ ఆట‌గాడు లియోనెల్ మెస్సీకి ఇదే చివ‌రి కోపా అమెరికా క‌ప్ అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ మ్యాచ్‌లో మెస్సీ గాయంలో మ్యాచ్ 66వ నిమిష‌యంలో మైదానాన్ని వీడాడు. డ‌గౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తూ భావోద్వేగానికి లోనైయ్యాడు. త‌న జ‌ట్టు విజ‌యం సాధించ‌డంతో మెస్సీ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

MS Dhoni : నేను సైనా నెహ్వాల్ భ‌ర్త‌ని.. ధోనితో క‌శ్య‌ప్‌.. త‌లా ఆన్స‌ర్ వైర‌ల్‌..

ట్రెండింగ్ వార్తలు