Lionel Messi cries : అయ్యో దేవుడా మెస్సీని ఇలా చూడలేమయ్యా.. కోపా అమెరికా కప్ ఫైనల్లో కన్నీళ్లు పెట్టుకున్న మెస్సీ.
అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- July 15, 2024 / 10:30 AM IST
Copa America Final Lionel Messi cries uncontrollably after being subbed due to injury
Lionel Messi : అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్, స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ మైదానంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో కొలంబియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మెస్సీ ఏడుస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏం జరిగిందంటే..?
కోపా అమెరికా టోర్నీ ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా, కొలంబియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో 36వ నిమిషంలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ గాయపడ్డాడు. అతడి చీలమండలానికి గాయం కావడంతో తీవ్రమైన నొప్పితో మైదానంలో విలవిలలాడాడు. వెంటనే ఫిజియో వచ్చి అతడికి చికిత్స అందించాడు. అతడికి ఉపశమనం కలగలేదు. అయినప్పటికి జట్టు కోసం నొప్పిని భరిస్తూ అలాగే ఆడాడు. మ్యాచ్లో హాఫ్ టైమ్ ముగిసిన తరువాత కూడా అర్జెంటీనా ఖాతా తెరవకపోవడంతో నొప్పిని భరిస్తూనే మెస్సీ ఆటను కొనసాగించాడు.
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా అల్కరాజ్.. ఓడిపోయిన జకోవిచ్
అయితే.. 66వ నిమిషయంలో తీవ్రమైన నొప్పి కలగడంతో మైదానాన్ని వీడాడు. డగౌట్లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న మెస్సీ తీవ్రమైన భావోద్వేగానికి లోనైయ్యాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు. అతడిని కెమెరాలు జూమ్ చేయగా.. చేతులను అడ్డుపెట్టుకుని కన్నీళ్లను తుడుచుకున్నాడు.
కాగా.. మెస్సీకి ఇదే చివరి కోపా అమెరికా టోర్నీ అని ప్రచారం జరుగుతున్న క్రమంలో మెస్సీ భావోద్వేగానికి లోనుకావడంతో అభిమానుల హృదయాలు బరువెక్కాయి. మెస్సీకి మద్దతుగా మెస్సీ, మెస్సీ అంటూ అతడి పేరును జపించారు. మైదానం మొత్తం అతడి నామస్మరణతో మారుమోగిపోయింది.
MS Dhoni : నేను సైనా నెహ్వాల్ భర్తని.. ధోనితో కశ్యప్.. తలా ఆన్సర్ వైరల్..
