Abrar Ahmed : అబ్రార్ అహ్మద్‌కు ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి పరిస్థితి ఎదురవుతుందా?

ది హండ్రెడ్ 2026 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ జ‌ట్టు పాకిస్థాన్ ఆట‌గాడు అబ్రార్ అహ్మ‌ద్‌ను (Abrar Ahmed ) కొనుగోలు చేసింది.

Could Abrar Ahmed face the same situation as Mustafizur Rahman in the Hundred 2026

Abrar Ahmed : ది హండ్రెడ్ 2026 సీజ‌న్ కోసం స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ జ‌ట్టు పాకిస్థాన్ ఆట‌గాడు అబ్రార్ అహ్మ‌ద్‌ను కొనుగోలు చేసింది. దీంతో కావ్య మార‌న్‌తో పాటు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వెంట‌నే అబ్రార్‌ను వదిలి వేయాల‌ని లేదంటే ఐపీఎల్ లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టును బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈనేప‌థ్యంలో బంగ్లాదేశ్ ఆట‌గాడు ముస్తాఫిజుర్ లాంటి ప‌రిస్థితి అబ్రార్‌కు ఎదురవుతుందా ? అన్న ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తున్నాయి.

ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌కు ఏం జ‌రిగిందంటే?

ఐపీఎల్ 2026 వేలంలో బంగ్లాదేశ్ ఆట‌గాడు ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌ను కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 9.20 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. ఆ సమ‌యంలో బంగ్లాదేశ్‌లో హిందువుల పై దాడులు జ‌రిగాయి. అంతేకాకుండా భార‌త్, బంగ్లాదేశ్‌ల మ‌ధ్య సంబంధాలు కూడా క్షీణించాయి.

BAN vs PAK : స‌ల్మాన్ అఘా ర‌నౌట్ పై మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ హాట్‌ కామెంట్స్‌.. కావాల‌నే చేశా.. అప్పుడు నేను ఆలోచించింది అదొక్క‌టే..

ఈ క్ర‌మంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్పించాల‌నే డిమాండ్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో బీసీసీఐ ఆదేశాల ప్ర‌కారం కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను త‌మ జ‌ట్టు నుంచి తొల‌గించింది. అత‌డి స్థానంలో జింబాబ్వే ప్లేయ‌ర్ ముజారబాని తీసుకుంది.

అబ్రార్‌ను అలాగే తొల‌గిస్తారా?

ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆధ్వ‌ర్యంలో ది హండ్రెడ్ టోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈసీబీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ జ‌ట్ట కూడా త‌మ ఇష్టానుసారం ప్లేయ‌ర్ ను విడుద‌ల చేయ‌కూడ‌దు. ప్లేయ‌ర్ వ్య‌క్తిగ‌త కార‌ణాలు లేదంటే మ‌రో కార‌ణం చేత స్వ‌త‌హాగా త‌ప్పుకుంటే త‌ప్పా.. ఆట‌గాడిని ఫ్రాంఛైజీలు తొల‌గించ‌లేవు. ఒక‌వేళ ఈసీబీ విడుద‌ల చేయాల‌ని చెబితే అప్పుడు ఫ్రాంఛైజీల త‌మ జ‌ట్టు నుంచి ఆట‌గాళ్ల‌ను తొల‌గించ‌వ‌చ్చు.

Jemimah Rodrigues : ట్రెండీ లుక్‌లో జెమీమా రోడ్రిక్స్‌..

అబ్రార్ అహ్మ‌ద్ విష‌యానికి వ‌స్తే.. ఈసీబీ అత‌డిని తొల‌గించ‌మ‌ని చెప్పే అవ‌కాశాలు దాదాపుగా లేవు. ఎందుకంటే వేలానికి ముందే పాక్ ఆట‌గాళ్ల పై వివ‌క్ష చూప‌కూడ‌ద‌ని అన్ని జ‌ట్ల‌కు ఈసీబీ ఆదేశాలు జారీ చేసింది. అబ్రార్ అహ్మ‌ద్ స్వ‌త‌హాగా లేదంటే ఈసీబీ విడుద‌ల చేయ‌మ‌ని చెబితే త‌ప్పా.. స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని జ‌ట్టు నుంచి తీసివేయ‌లేదు.