కటక్ వన్డే : ఒక్కసారిగా మారిన సీన్.. 4 వికెట్లు డౌన్

కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.

  • Publish Date - December 22, 2019 / 10:35 AM IST

కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి.

కటక్ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక వన్డేలో.. ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వెస్టిండీస్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. స్వల్ప పరుగుల తేడాలో 4 వికెట్లు పడ్డాయి. ఒకానొక సమయంలో ఓపెనర్లు ఇద్దరూ(లూయిస్, హోప్) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో.. విండీస్ పటిష్ట స్థితిలో కనిపించింది. భారీ స్కోర్ దిశగా సాగిపోతున్నట్టు అనుమానాలు కలిగాయి. ఇంతలోనే సీన్ మారింది. భారత బౌలర్లు సత్తా చూపారు. 57 పరుగుల జట్టు స్కోర్ దగ్గర విండీస్ తొలి వికెట్ పడింది. జడేజా ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు. లూయిస్(21) ను ఔట్ చేశాడు.

ఆ తర్వాత 70 పరుగుల జట్టు స్కోర్ దగ్గర విండీస్ 2వ వికెట్ ను, 132 పరుగుల దగ్గర 3వ వికెట్ ను, 144 పరుగుల దగ్గర 4వ వికెట్ కోల్పోయింది. హోప్(42), చేస్ (38), హెట్ మెయిర్ (37)ను ఔట్ అయ్యారు. షైనీ రెండు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు.. బౌలింగ్ ఎంచుకుంది.

హోప్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. షమీ వేసిన 20 ఓవర్‌ రెండో బంతికి బౌల్డ్‌ అయ్యాడు. 42 వ్యక్తిగత రన్స్ దగ్గర షమీ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలమైన హోప్‌ బౌల్డయ్యాడు. అంతకుముందు లూయిస్ ‌(21) ఫస్ట్ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన తన తొలి ఓవర్‌లో లూయిస్‌ ఔటయ్యాడు. 15 ఓవర్‌ ఆఖరి బంతికి నవదీప్‌ షైనీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. 

కాగా, ఈ మ్యాచ్ లో విండీస్ ఓపెనర్‌ షాయ్‌ హోప్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డే ఫార్మాట్‌లో 3వేల పరుగులు సాధించాడు. హోప్‌ 35 పరుగుల దగ్గర ఈ మార్క్ ను అందుకున్నాడు. వేగవంతంగా ఈ ఫీట్‌ను సాధించిన రెండో ఆటగాడిగా హోప్ రికార్డు నెలకొల్పాడు. హోప్‌కు ఇది 67వ వన్డే ఇన్నింగ్స్‌. 

పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ బాబర్‌ అజామ్‌ రికార్డ్ ను హోప్‌ క్రాస్ చేశాడు. బాబర్‌ అజామ్‌ 68 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు సాధిస్తే.. హోప్‌ ఒక ఇన్నింగ్స్‌ ముందుగానే ఆ మార్కును చేరాడు. వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 3 వేల పరుగులు సాధించిన వారిలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ హషీమ్‌ ఆమ్లా(57 ఇన్నింగ్స్‌లు) టాప్ లో ఉన్నాడు. ఆ తర్వాత హోప్‌, అజామ్‌ ఉన్నారు. ఇక వెస్టిండీస్‌ తరఫున వన్డేల్లో 3 వేల పరుగులు సాధించిన 12వ ఆటగాడిగా హోప్‌ నిలిచాడు.