David Warner : చరిత్ర సృష్టించిన డేవిడ్ వార్నర్.. సచిన్, డివిలియర్స్ రికార్డు బద్దలు
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు.
- Thota Vamshi Kumar
- Published On : October 8, 2023 / 03:06 PM IST
pic @ ESPNcricinfo
David Warner : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. వార్నర్ వ్యక్తిగత స్కోరు 9 పరుగుల వద్ద అతడు ఈ ఘనతను అందుకున్నాడు. ఇంతకముందు ఈ రికార్డు టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ల పేరిట ఉండగా.. తాజాగా వార్నర్ బ్రేక్ చేశాడు. సచిన్, డివిలియర్స్‌లు చెరో 20 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును అందుకోగా వార్నర్ 19 ఇన్నింగ్స్‌లల్లోనే ఈ ఘనతను సాధించాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) -19 ఇన్నింగ్స్‌ల్లో
సచిన్ టెండూల్కర్ (భారత్) – 20 ఇన్నింగ్స్‌ల్లో
ఏబి డివిలియర్స్ (దక్షిణాఫ్రికా) – 20 ఇన్నింగ్స్‌ల్లో
వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
సౌరవ్ గంగూలీ (భారత్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
మార్క్ వా (ఆస్ట్రేలియా)- 22 ఇన్నింగ్స్‌ల్లో
హెర్షెల్ గిబ్స్ (దక్షిణాఫ్రికా) – 22 ఇన్నింగ్స్‌ల్లో
Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. అనిల్‌కుంబ్లే రికార్డు బ్రేక్
David Warner becomes the fastest to 1000 men’s ODI World Cup runs ⚡️ #INDvAUS #CWC23 pic.twitter.com/ObfoKkVPHR
— ESPNcricinfo (@ESPNcricinfo) October 8, 2023
వన్డే ప్రపంచకప్‌లలో ఆస్ట్రేలియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్ల జాబితాలో వార్నర్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్ 1743 జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
రికీ పాంటింగ్ – 1743
ఆడమ్ గిల్‌క్రిస్ట్ – 1085
మార్క్ వా – 1004
డేవిడ్ వార్నర్ – 1001*
మాథ్యూ హేడెన్ – 987
