David Warner : పుష్ప స్టైల్‌లో డేవిడ్ వార్నర్ హిందీ యాడ్.. అల్లు అర్జున్ రియాక్షన్ వైరల్
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను తెలుగు వాళ్లకు పరిచయం చేయాల్సిన పని లేదు
- Thota Vamshi Kumar
- Published On : June 11, 2024 / 01:00 PM IST
Warner channels his inner Pushpa Raj in new ad Allu Arjun reacts
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను తెలుగు వాళ్లకు పరిచయం చేయాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో కొన్నేళ్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించిన వార్నర్ ఇక్కడి వారికి బాగా దగ్గర అయ్యాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో తెలుగు సినిమాల హీరోల డైలాగ్స్, పాటలకు రీల్స్ చేసి అలరించాడు. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీల్లోని పాటలకు, డైలాగ్స్‌కు ఎక్కువగా రీల్స్ చేశాడు. ఇక ఎస్ఆర్‌హెచ్ అతడిని వదిలి వేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు.
కాగా.. తాజాగా వార్నర్ ఓ వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన యాడ్ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వేక్‌ఫిట్ మ్యాట్రెస్ వాణిజ్య ప్రకటనలో వార్నర్ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను పోషించాడు. హిందీలో డైలాగ్‌లు చెప్పాడు. పుష్స లెవెల్‌లో ఎడమ చేత్తో తగ్గేదేలే ఫోజ్ సైతం ఇచ్చాడు.
Bumrah : బుమ్రా కపుల్ ఇంటర్వ్యూ వైరల్.. త్వరలోనే మళ్లీ కలుద్దాం.. ఏదీ 30 నిమిషాల్లోనా..!
వార్నర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారగా దీనిపై అల్లు అర్జున్ స్పందించాడు. నవ్వుతున్న ఎమోజీలతో ఫైర్, థంబ్స్ అప్ ఎమోజీలను పోస్ట్ చేశాడు.
South Africa : చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమ్ఇండియా రికార్డు కనుమరుగు..
ఇదిలా ఉంటే.. వార్నర్ ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. తన కెరీర్‌లో ఇదే చివరి ప్రపంచకప్ అని వార్నర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
