David Warner : వార్నర్ మామ.. నీలో ఈ కళ కూడా ఉందా..
టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20లు మాత్రమే ఆడుతున్నారు.
![David Warner : వార్నర్ మామ.. నీలో ఈ కళ కూడా ఉందా.. David Warner : వార్నర్ మామ.. నీలో ఈ కళ కూడా ఉందా..](https://10tv.in/wp-content/uploads/2024/02/New-Project-9-8.jpg)
David Warner stuns West Indies with outrageous reverse swat for six
David Warner Reverse Scoop : టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ ప్రస్తుతం టీ20లు మాత్రమే ఆడుతున్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ ఆటగాడు అద్భుతమైన టచ్‌లో ఉన్నాడు. అడిలైడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో వార్నర్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 19 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 3 ఫోర్లు, 1సిక్స్ బాది 22 పరుగులు చేశాడు. కాగా.. తొలి ఓవర్లో వార్నర్ కొట్టిన ఓ షాట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. మొదటి ఓవర్‌ను విండీస్ స్పిన్నర్ అకేల్ హోసేన్ వేశాడు. రెండో బంతిని వార్నర్ ను రివర్స్ స్వీప్ ఆడాడు. షార్ట్ థర్డ్ మ్యాన్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. ఇది స్విచ్ హిట్లానే ఉంది. వార్నర్ ఇలాంటి షాట్ ఆడతాడని అకేల్ హోసేన్ కూడా ఊహించి ఉండడు. ఈ వీడియో వైరల్‌గా మారగా వార్నర్ మామ నీలో ఈ కళ కూడా ఉందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Glenn Maxwell : మాక్స్వెల్ విధ్వంసకర శతకం.. భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సమం
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. గ్లెన్ మాక్స్వెల్ (120; 55 బంతుల్లో 12 ఫోర్లు, 8సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. టిమ్ డేవిడ్ (31నాటౌట్), మిచెల్ మార్ష్ (29) లు రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో జేసన్ హోల్డర్ రెండు, అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ లు చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 207 పరుగులకు పరిమితమైంది. వెస్టిండీస్ బ్యాటర్లలో రొమ్‌మన్ పావెల్ (63) అర్ధశతకం చేశాడు. ఆండ్రీ రస్సెల్ (37), జేసన్ హోల్డర్ (28 నాటౌట్) రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో లక్ష్యానికి 34 పరుగుల దూరంలో విండీస్ నిలిచిపోయింది. ఆసీస్ బౌలర్లలో మార్కస్ స్టోయినిస్ మూడు, జోష్ హేజిల్ వుడ్, స్పెన్సర్ జాన్సన్ లు చెరో రెండు, జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆడమ్ జంపాలు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
KL Rahul : ఆదివారం రోజున కేఎల్ రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసా?
ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
Now that’s a UNIQUE way to get off the mark! #AUSvWI pic.twitter.com/Ynz2colsXx
— cricket.com.au (@cricketcomau) February 11, 2024