Glenn Maxwell : మాక్స్‌వెల్ విధ్వంస‌క‌ర శ‌త‌కం.. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డు స‌మం

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెను విధ్వంసం సృష్టించాడు.

Glenn Maxwell : మాక్స్‌వెల్ విధ్వంస‌క‌ర శ‌త‌కం.. భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డు స‌మం

Glenn Maxwell equals Rohit Sharma’s record for most T20I centuries

Glenn Maxwell- Rohit Sharma : ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ పెను విధ్వంసం సృష్టించాడు. అడిలైడ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో టీ20 మ్యాచులో అత‌డు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయాడు. శత‌కంతో అరుదైన రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న మాక్సీ 218.18 స్ట్రైక్‌రేటుతో 120 ప‌రుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 8 సిక్స‌ర్లు ఉన్నారు. ఇది అంత‌ర్జాతీయ క్రికెట్‌లో మాక్స్‌వెల్ కు ఐదో సెంచ‌రీ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌తో క‌లిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.

143 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ శ‌ర్మ ఐదు సెంచ‌రీలు బాద‌గా మాక్స్‌వెల్ కేవ‌లం 94 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త అందుకున్నాడు. వీరిద్ద‌రి త‌రువాత ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్‌ (4), కొలిన్‌ మన్రో (3), బాబర్ ఆజాం (3) త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

అంతర్జాతీయ టీ20ల్లో మాక్స్‌వెల్‌ సెంచరీల జాబితా..

2016లో శ్రీలంక పై 65 బంతుల్లో 145 ప‌రుగులు
2018లో ఇంగ్లాండ్ పై 58 బంతుల్లో 103
2019లో భార‌త్ పై 55 బంతుల్లో 113
2023లో భార‌త్ పై 48 బంతుల్లో 104
2024లో వెస్టిండీస్ 55 బంతుల్లో 120

KL Rahul : ఆదివారం రోజున‌ కేఎల్ రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసా?

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మాక్స్‌వెల్ విధ్వంస‌క‌ర శ‌త‌కం బాద‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు న‌ష్టపోయి 241 ప‌రుగులు చేసింది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో మాక్స్‌వెల్ తో పాటు టిమ్‌ డేవిడ్‌ (31 నాటౌట్‌; 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్‌ (29; 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌ (22; 19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌) లు రాణించారు. వెస్టిండీస్ బౌల‌ర్ల‌లో జేస‌న్ హోల్డ‌ర్ రెండు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్, రొమారియో షెపర్డ్ లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.
Kane Williamson : కేన్ విలియ‌మ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌.. మిస్ యూ శాండీ పాప‌

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్లు కోల్పోయి 207 ప‌రుగుల‌కు పరిమిత‌మైంది. దీంతో ఆసీస్ 34 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో రొమ్‌మ‌న్ పావెల్ (63; 36 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్స‌ర్లు) హాప్ సెంచ‌రీ చేశాడు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మార్క‌స్ స్టోయినిస్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. జోష్ హేజిల్ వుడ్‌, స్పెన్సర్ జాన్సన్ లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. జాసన్ బెహ్రెండోర్ఫ్, ఆడ‌మ్ జంపాలు ఒక్కొ వికెట్ సాధించాడు.