KL Rahul : ఆదివారం రోజున‌ కేఎల్ రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసా?

రీ ఎంట్రీ త‌రువాత కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు.

KL Rahul : ఆదివారం రోజున‌ కేఎల్ రాహుల్ ఏం చేస్తున్నాడో తెలుసా?

KL Rahul

రీ ఎంట్రీ త‌రువాత కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జ‌ట్టుకు అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో వికెట్ కీప‌ర్ పాత్ర‌ను పోషిస్తూ బ్యాటింగ్‌లో త‌న‌దైన ముద్ర‌ను వేస్తున్నాడు. ఒక‌ప్పుడు నిల‌క‌డ‌లేమీతో స‌త‌మ‌త‌మైన అత‌డు ప్ర‌స్తుతం అత్యంత నిల‌క‌డ‌గా ఆడుతున్నాడు. అయితే.. వెన్నుస‌మ‌స్య కార‌ణంగా విశాఖ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచులో ఆడ‌లేదు. హైద‌రాబాద్‌లో జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో తొలి ఇన్నింగ్స్‌లో 86 ప‌రుగులు చేశాడు. భార‌త్ మంచి స్కోరు సాధించ‌డంలో త‌న వంతు పాత్ర‌పోషించాడు. కాగా.. ప్ర‌స్తుతం అత‌డు మూడో టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఇంగ్లాండ్ మిగిలిన మూడు టెస్టు మ్యాచ్‌ల‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఇందులో రాహుల్‌కు చోటు ఇచ్చింది. ఈ క్ర‌మంలో రాహుల్ నెట్స్‌లో ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియో ద్వారా తాను మైదానంలో దిగేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు త‌న అభిమానుల‌కు రాహుల్ చెప్ప‌క‌నే చెప్పాడు.

ఐపీఎల్‌లో గాయ‌ప‌డి..

గత కొన్ని నెలలుగా కేఎల్ రాహుల్‌ చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. జట్టు నుంచి చోటు కోల్పోవ‌డం ద‌గ్గ‌రి నుంచి గాయాల వ‌ర‌కు ఎన్నింటినో అధిగ‌మించాడు. గత ఏడాది ఇదే సమయంలో రెడ్ బాల్ క్రికెట్‌లో రాహుల్ త‌న ఫామ్ కోల్పోయాడు. ప‌రుగులు చేయ‌లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో అత‌డు జ‌ట్టు నుంచి తొల‌గించ‌బ‌డ్డాడు. అయితే.. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం ప‌రుగులు చేస్తున్నాడు.

Kane Williamson : కేన్ విలియ‌మ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌.. మిస్ యూ శాండీ పాప‌

ఐపీఎల్ 2023 సంద‌ర్భంగా బౌండ‌రీ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తూ రాహుల్ తొడ కండ‌రాల గాయానికి గురైయ్యాడు. దీంతో ఐపీఎల్ మ‌ధ్య‌లోనే అత‌డు నిష్ర్క‌మించాడు. లండ‌న్‌లో శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు దాదాపు నాలుగు నెల‌ల పాటు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు దూరం అయ్యాడు. ఆసియా క‌ప్ 2023తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ఆరంభ మ్యాచ్‌ల‌కు దూరం అయ్యాడు.

టోర్నీ సూప‌ర్‌-4 ద‌శ‌లో పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచ్ లో సెంచ‌రీతో రీ ఎంట్రీని ఘ‌నంగా చాటి చెప్పాడు. అప్ప‌టి నుంచి రాహుల్ మ‌ళ్లీ వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో వికెట్ కీప‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే బ్యాటింగ్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విన్నింగ్ నాక్ ఆడాడు. ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లోనూ రాణించాడు.

Sourav Ganguly : తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న గంగూలీ.. ఆ స‌మాచారం ఎక్క‌డ లీక్ అవుతుందోన‌ని!

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మూడో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది. గాయం నుంచి కోలుకున్న రాహుల్ నెట్స్‌లో ప్రాక్టీస్ మొద‌లెట్టాడు.

మిగిలిన మూడు టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ర్పిత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, రజిత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషిగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.