Kane Williamson : కేన్ విలియ‌మ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌.. మిస్ యూ శాండీ పాప‌

న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు కేన్ విలియమ్సన్ కు పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Kane Williamson : కేన్ విలియ‌మ్సన్ ఇంట్లో తీవ్ర విషాదం.. సోష‌ల్ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌.. మిస్ యూ శాండీ పాప‌

Kane Williamson

Updated On : February 11, 2024 / 3:52 PM IST

Kane Williamson-Sandy : న్యూజిలాండ్ స్టార్ ఆట‌గాడు కేన్ విలియమ్సన్ కు పెంపుడు జంతువులు అంటే ఎంత ఇష్టమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆయ‌న ఇంటి వద్ద ఉన్న స‌మ‌యంలో వాటితో క‌లిసి స‌ర‌దాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుండ‌డాన్ని చూస్తూనే ఉంటాం. ఇక ఓ కుక్క‌ను ద‌త్త‌త తీసుకుని దానికి శాండీ అని పేరుపెట్టుకున్నాడు. అది అంటే కేన్‌మామకు చాలా ఇష్టం. అయితే.. తాజాగా ఆయ‌న ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కేన్‌ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే శాండీ మ‌ర‌ణించింది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేన్ మామ సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు. శాండీకి సంబంధించిన కొన్ని ఫోటోల‌ను షేర్ చేసి భావోద్వేగానికి గురి అయ్యాడు. “ప్రియ‌మైన శాండీ అమ్మాయికి మేము వీడ్కోలు చెప్పాల్సి వ‌చ్చింది. 8 ఏళ్ల వ‌య‌సులో శాండీని ద‌త్త‌త తీసుకున్నాము. ఇప్ప‌డు దాని వ‌య‌సు 16 సంవ‌త్స‌రాలు. ఆమె మా జీవితంలో వ‌చ్చిన త‌రువాత నుంచి మాకు ఎన్నో ఆనంద‌క‌ర‌మైన జ్ఞాప‌కాల‌ను అందించింది. వాటిని మేము ఎప్పుడూ మ‌రిచిపోము. ఇందుకు ఆమెకు కృత‌జ్ఞ‌త‌లు. మిస్ యూ గ‌ర్ల్‌.” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

Sourav Ganguly : తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న గంగూలీ.. ఆ స‌మాచారం ఎక్క‌డ లీక్ అవుతుందోన‌ని!

 

View this post on Instagram

 

A post shared by Kane Williamson (@kane_s_w)


కొవిడ్ లాక్‌డౌన్‌లో శాండీతో క‌లిసి కేన్ క్రికెట్ ఆడాడు.

 

View this post on Instagram

 

A post shared by Kane Williamson (@kane_s_w)

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!
ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు కేన్ విలియమ్సన్. ఇటీవ‌ల ద‌క్షిణాప్రికాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచులో రెండు ఇన్నింగ్స్‌లో శ‌త‌కాలు బాదాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో 118 ప‌రుగులు చేసిన విలియ‌మ్స‌న్ రెండో ఇన్నింగ్స్‌లో 109 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో రెండు ఇన్నింగ్స్‌లో సెంచ‌రీలు చేసిన ఐదో న్యూజిలాండ్ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. అంతేకాకుండా టెస్టుల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా కేన్ మామ కొన‌సాగుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 31 శ‌త‌కాలు బాదాడు.