David Warner : హాలీవుడ్ హీరో లెవల్‌లో.. హెలికాఫ్టర్ నుంచి దిగుతూ క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్న డేవిడ్ వార్నర్..!
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇటీవలే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
- Thota Vamshi Kumar
- Published On : January 11, 2024 / 03:06 PM IST
David Warner
Warner : ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ ఇటీవలే వన్డేలు, టెస్టులకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వార్నర్ కేవలం టీ20 క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అయితే.. వార్నర్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) లో వార్నర్ సిడ్నీ థండర్ జట్టు తరుపున ఆడుతున్నాడు. శుక్రవారం ఆ జట్టు సిడ్నీ సిక్సర్‌తో తలపడనుంది.
ఈ నేపథ్యంలో సిడ్నీ క్రికెట్ మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు వార్నర్ హాలీవుడ్ హీరో లెవల్‌లో హెలికాఫ్టర్ ద్వారా మైదానంలో అడుగుపెట్టనున్నాడు. అసలు ఇలా మైదానానికి రావడానికి గల ఓకారణం ఉంది.
Mohammed Shami : ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు షెమీ సిద్ధమయ్యాడా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే ..
ఎందుకంటే..?
జనవరి 12 శుక్రవారం ఉదయం డేవిడ్ వార్నర్ సోదరుడి పెళ్లి హంటర్ హ్యలీలో జరగనుంది. అదే రోజు సాయంత్రం బీబీఎల్ 2023-2024 సీజన్‌లో భాగంగా సిడ్నీ మైదానంలో సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ తప్పక ఆడాలని వార్నర్ భావిస్తున్నాడు. అయితే.. పెళ్లి జరిగే, మ్యాచ్ జరిగే ప్రాంతానికి మధ్య దూరం 250 కిలోమీటర్లు. బస్‌లో లేదా కారులో లేదంటే ఇంకా ఏదైన వాహనంలో బయలుదేరితే.. మ్యాచ్ సమయానికి చేరుకోవడం కాస్త కష్టమైన విషయం.
He’s back!
Full #SydneySmash squad details ▶️ https://t.co/MDyEhhv9GM #ThunderNation pic.twitter.com/F9gecDcOHH
— Sydney Thunder (@ThunderBBL) January 11, 2024
దీంతో పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం వార్నర్ ప్రైవేటు హెలికాప్టర్‌లో సిడ్నీకి బయలు దేరనున్నాడు. మైదానంలోకి ప్రేక్షకులు అడుగుపెట్టక ముందే గ్రౌండ్‌లోని ఔట్‌ఫీల్డ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కానుందని సిడ్నీ థండర్స్ తెలిపింది.
India vs Afghanistan: అఫ్గాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పులు.. పిచ్ వాళ్లకే అనుకూలం
ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో సిడ్నీ థండర్స్ ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడింది. కేవలం ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సిడ్నీ సిక్సర్ ఎనిమిది మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో గెలుపొందింది. రెండు మ్యాచుల్లో ఓడిపోగా మరో రెండు మ్యాచులు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది.
