Mohammed Shami : ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు షమీ సిద్ధమయ్యాడా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే..

భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

Mohammed Shami : ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు షమీ సిద్ధమయ్యాడా? బీసీసీఐ వర్గాలు ఏం చెప్పాయంటే..

Mohammed Shami

BCCI : భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా ఈనెల 25 నుంచి 29వ తేదీ వరకు జరుగుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత్ జట్టు ను ఇంకా ప్రకటించలేదు. ఈ వారంలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఈ సిరీస్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఆడే అవకాశం లేదని, తొలి రెండు టెస్టులకు అతను దూరమవుతాడని వార్తలొచ్చాయి. తాజాగా.. మహ్మద్ షమీ ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు తొలి మ్యాచ్ నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సిరీస్ లో తొలి టెస్ట్ మ్యాచ్ లోనూ ఆడేందుకు షమీ సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలో ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఫిట్ నెస్ సాధిస్తేనే సెలక్షన్ కమిటీ అతడిని తొలి టెస్టు నుంచి పరిగణలోకి తీసుకోనుంది.

Also Read : విరాట్ కోహ్లీ ఈ హీరోయిన్ కి బావ అంట.. ఎలా? విరాట్ గురించి ఏమని చెప్పింది?

భారత ఫాస్ట్ బౌలర్ షమీ గాయంతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనకూ దూరమైన విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో తొలి టెస్టు నుంచి ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు వన్డేలు, టెస్టుల్లో ఎక్కువగా కనిపిస్తున్న షమీకి అంతర్జాతీయ టీ20 జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. గత ఐపీఎల్ లో రాణించిన అతడిని తీసుకోవాలనే డిమాడ్లూ ఉన్నాయి. ఈ విషయంపై షమీ మాట్లాడుతూ.. ఎప్పుడు టీ20 ఫార్మాట్ గురించి చర్చ వచ్చినా నేను సెలక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో తెలియడం లేదని అన్నాడు. వచ్చే ఐపీఎల్ లో ఆడతా.. అక్కడ రాణిస్తే టీ20 ప్రపంచ కప్ లో ఆడే అవకాశం వస్తుందేమో చూడాలని షమీ అన్నాడు.

Also Read : రియాన్ ప‌రాగ్ మెరుపు శ‌త‌కం.. వెస్టిండీస్ దిగ్గ‌జం వివ్ రిచ‌ర్డ్స్ రికార్డు స‌మం

అయితే, షమీ భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించి త్వరలోనే బీసీసీఐ స్పందించనుందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్నేళ్లుగా అతడు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. షమీతో తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉందని, ఆ చర్చల తరువాత ఐపీఎల్, టెస్ట్ ఫార్మాటే కాకుండా ఎంత మొత్తం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడనేది అప్పుడే తేలనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.