Deepti Sharma : హ‌నుమాన్ జీ ద‌య వ‌ల్లే ఇదంతా.. భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ కామెంట్లు..

టీమ్ఇండియా విజ‌యం సాధించ‌డంలో భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ (Deepti Sharma) కీల‌క పాత్ర పోషించింది.

Deepti Sharma comments after PLAYER OF THE MATCH award received against Pakistan in Womens T20 World Cup 2026

  • పాక్ పై విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్
  • ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
  • త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేసిన దీప్తి శ‌ర్మ‌

Deepti Sharma : ఇంగ్లాండ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భార‌త్ విజ‌యంతో బోణీ కొట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 64 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. టీమ్ఇండియా విజ‌యం సాధించ‌డంలో భార‌త స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ కీల‌క పాత్ర పోషించింది. 5 వికెట్ల‌తో పాక్ ప‌త‌నాన్ని శాసించింది. దీంతో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ అవార్డును అందుకున్న అనంత‌రం దీప్తి మాట్లాడుతూ.. త‌న ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. అదే స‌మ‌యంలో హ‌నుమాన్ జీ గొప్ప‌వారు అంటూ హ‌నుమంతుడిని స్మరించుకోవడం విశేషం.

‘పిచ్ పై బంతి బాగా ట‌ర్న్ అవుతోంది. ఇలాంటి పిచ్‌లు అంటే నాకు చాలా ఇష్టం. నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల ఎంతో కృత‌జ్ఞ‌త‌తో ఉన్నాను. హ‌నుమాన్ జీ గొప్ప‌వారు. ఈ విజ‌యానికి కార‌ణం మా జ‌ట్టే. వారికే ఆ ఘ‌న‌త ద‌క్కుతుంది. నా ప్ర‌యాణం మొద‌లైన‌ప్ప‌టి నుంచి నాకు ఐసీసీ టోర్నీలు అంటే చాలా ఇష్టం.’ అని దీప్తి శ‌ర్మ తెలిపింది.

Deepti Sharma : చ‌రిత్ర సృష్టించిన దీప్తి శ‌ర్మ‌.. మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో ఏకైక ప్లేయ‌ర్‌..

పిచ్ పై బంతి బాగా తిరుగుతోందని, అందుక‌నే ప్ర‌తి బంతికి, ప్ర‌తి ఓవ‌ర్‌కు బాల్ వేగాన్ని మారుస్తూ వ‌చ్చానని అంది. ఈ వ్యూహాం ఎంతగానో ఉప‌యోగ ప‌డిందని చెప్పుకొచ్చింది. త‌ద్వారా ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌కు త‌న బంతులు ఆడ‌డం క‌ష్ట‌మైందని అభిప్రాయ‌ప‌డింది. లైన్ అండ్ లెంగ్త్ లో బౌలింగ్ చేయ‌డంపైనే త‌న దృష్టి ఉన్న‌ట్లు చెప్పింది.

కొన్ని మ్యాచ్‌ల్లో వికెట్లు ద‌క్క‌క‌పోవ‌డంపై స్పందిస్తూ.. ఆ స‌మ‌యంలో తాను పెద్ద‌గా ఆందోళ‌న చెంద‌లేని అంది. స‌రైన స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు జ‌ట్టు కోసం రాణిస్తాన‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఎల్ల‌ప్పుడూ ఉంద‌ని చెప్పింది. ఇక ఈ మ్యాచ్‌లో స్మృతి మంధాన‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ భాగ‌స్వామ్య‌మే కీల‌కం అని, అదే మ్యాచ్‌లో త‌మ‌ని నిల‌బెట్టింద‌ని చెప్పుకొచ్చింది.

Fatima Sana : ఆ త‌ప్పు వ‌ల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా స‌నా కామెంట్లు..

ఇక ఇంగ్లాండ్‌లో అభిమానుల మ‌ద్ద‌తు గురించి మాట్లాడుతూ.. ఇక్క‌డి ప్రేక్ష‌కుల స్పంద‌న అద్భుతంగా ఉంద‌ని అంది. ఎంతో మంది మైదానానికి వ‌చ్చి భార‌త జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని అంది. ప్రతి మ్యాచ్‌లోనూ తాము కోరుకునేది ఇదేన‌ని అంది. ఇలాగే వచ్చి మద్దతునిస్తూ ఉండాల‌ని కోరింది.