Deepti Sharma : చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. మహిళల టీ20 క్రికెట్లో ఏకైక ప్లేయర్..
టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ (Deepti Sharma) అరుదైన ఘనత సాధించింది.
Deepti Sharma creates history Most wickets in taken Women T20Is
- పాక్ పై 5 వికెట్ల ఘనత
- చరిత్ర సృష్టించిన భారత ఆల్రౌండర్ దీప్తి శర్మ
- మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా
Deepti Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ అరుదైన ఘనత సాధించింది. మహిళల టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆమె 5 వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో దీప్తి తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది.
ఈ క్రమంలో ఆమె థాయిలాండ్ ప్లేయర్ తిపట్చా పుట్టావాంగ్ ను అధిగమించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో తిపట్చా పుట్టావాంగ్ 165 వికెట్లు పడగొట్టగా దీప్తి శర్మ 166 వికెట్లను సాధించింది.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్లు వీరే..
- దీప్తి శర్మ (భారత్) – 145 మ్యాచ్ల్లో 166 వికెట్లు
- తిపట్చా పుట్టావాంగ్ (థాయ్లాండ్) – 105 మ్యాచ్ల్లో 165 వికెట్లు
- హెన్రియెట్ ఇషిమ్వే (రువాండ) – 131 మ్యాచ్ల్లో 160 వికెట్లు
- మేగాన్ షట్ (ఆస్ట్రేలియా) – 125 మ్యాచ్ల్లో 152 వికెట్లు
- ఓ కమ్చోంఫు (థాయ్లాండ్) – 137 మ్యాచ్ల్లో 148 వికెట్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా హర్మన్ ప్రీత్ కౌర్ (36; 35 బంతుల్లో 4 ఫోర్లు), రిచా ఘోష్ (34; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సాదియా ఇక్బాల్, ఫాతిమా సనా లు చెరో రెండు వికెట్లు, తస్మియా రుబాబ్, రామీన్ షమీమ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
*Fatima Sana : ఆ తప్పు వల్లే ఓడిపోయాం.. లేదంటేనా.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా కామెంట్లు..
A historic fifer for a historic milestone! 🫡
Deepti Sharma, take a bow 👏💙
Scorecard ▶️ https://t.co/1tfRc3jcrX#TeamIndia | #WomenInBlue | #T20WorldCup | @Deepti_Sharma06 pic.twitter.com/i606UJ3qPI
— BCCI Women (@BCCIWomen) June 14, 2026
ఆ తరువాత మునీబా అలీ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినప్పటికి మిగిలిన ప్లేయర్లు విఫలం కావడంతో 171 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 64 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లు తీయగా.. శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది. షషాలీ వర్మ ఓ వికెట్ సాధించింది.
