dhoni@ ఐపీఎల్లో 150.. చెపాక్ లో 50

ఐపీఎల్లో భాగంగా చెపాక్ స్టేడియంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో సొంతగడ్డపై జరిగిన సమరంలో చెన్నై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 150వ మ్యాచ్ కాగా, చెన్నైలోని చెపాక్ స్టేడియంలో 50వ మ్యాచ్. ఇటువంటి ప్రత్యేకమైన మ్యాచ్ ను చెన్నై విజయంతోనే ముగించింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ చక్కటి షాట్ లతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు 161 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. చేధనకు దిగిన పంజాబ్ 5వికెట్లు నష్టపోయి 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. గేమ్ ఫినిషర్ గా మరోసారి మహీ 23 బంతుల్లో 37 పరుగులు బాది జట్టు ఖాతాలో పరుగులు పెంచాడు. 

తన తర్వాతి మ్యాచ్ ను చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 9 మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. లీగ్ లో 23వది అయిన మ్యాచ్ కు చిదంబరం స్టేడియం వేదిక కానుంది.