మంచి గేమ్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్‌లో ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. టీమిండియాకు ఆడుతూ ఇలా జరగడం ఇదో ఐదోసారి. ధోనీ అత్యధిక పరుగులు చేసి జట్టు భారీ తేడాతో ఓడిపోవడం కెరీర్‌లోనే ఐదోసారి. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 80పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టీ20ల్లో ఇంత ఘోరంగా భారత్ తొలి సారి ఓడిపోయింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓవర్‌కు 12 పరుగులు కావలసిన స్థితిలో ధోనీ బరిలోకి దిగాడు.
దూకుడు మీదే కనిపించిన ధోనీ.. 31 బంతులకు 39 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో 1500పరుగులను పూర్తి చేసుకున్నాడు. 220పరుగుల లక్ష్య చేధనకు దిగిన టీమిండియా మ్యాచ్ ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడింది. ఆ తర్వాత శిఖర్ ధావన్(29)పరుగులకే పరిమితమై పెవిలియన్ చేరాడు. ఇక ఆ తర్వాత ధోనీని మినహాయించి మిగిలినవారందరినీ చాకచక్యంగా చుట్టేసిన కివీస్ 139పరుగులకే ముగించింది.
మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మ..’ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో బ్యాటింగ్ దిగినప్పటికీ లక్ష్యాన్ని చేధించలేకపోయాం. 200కు మించిన టార్గెట్ చేరుకోవడం కష్టంతో కూడకున్న పనే. కానీ, అంతటి భారీ స్కోరును చేధించిన సందర్భాలు లేకపోలేదు. కొద్దిపాటి భాగస్వామ్యాన్ని కూడా ఏర్పాటు చేయలేకపోయాం. ఇక తర్వాత మ్యాచ్‌కు ఆక్లాండ్ వెళ్లాల్సి ఉంది. అక్కడ పిచ్, వాతావరణ పరిస్థితులును గమనించి దానికి తగ్గట్టు సిద్ధమవుతాం’ అని పేర్కన్నారు.
ధోనీ అత్యథిక పరుగులు చేసి ఓడిపోయిన టీ20లు ఇలా: