Rishabh Pant : ఐపీఎల్ 2025లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌.. పంత్‌ను వ‌దులుకోవాల‌నుకున్న ల‌క్నో? సంజీవ్ గొయెంకా హాట్ కామెంట్స్‌..

రిష‌బ్ పంత్‌ను (Rishabh Pant ) ల‌క్నో జ‌ట్టు 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.

Did LSG Decide To Release Rishabh Pant After IPL 2025

Rishabh Pant : ఐపీఎల్ 2024 ముగిసిన త‌రువాత త‌మ జ‌ట్టు అయిన కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వ‌దిలివేసింది. ఆ త‌రువాత ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు నిర్వ‌హించిన వేలంలో టీమ్ఇండియా వికెట్ కీప‌ర్‌, బ్యాట‌ర్ రిష‌బ్ పంత్‌ను ల‌క్నో జ‌ట్టు 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. అనంత‌రం ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు అత‌డినే కెప్టెన్‌గా నియ‌మించింది.

అత‌డి నాయ‌క‌త్వంలో జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌ని అంతా భావించారు. క‌ట్ చేస్తే సీన్ రివ‌ర్స్ అయింది. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ల‌క్నో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. లీగ్ ద‌శ‌లో 14 మ్యాచ్‌లు ఆడ‌గా 6 మ్యాచ్‌ల్లోనే విజ‌యం సాధించింది. మ‌రో 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 12 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఏడో స్థానంతో సీజ‌న్‌ను ముగించింది. మ‌రోవైపు రిష‌బ్ పంత్ కు ఈ సీజ‌న్ చేదు అనుభంగానే మిగిలింది.

Pakistan Super League : ఇంధ‌న సంక్షోభం.. ఖాళీ స్టేడియాల్లో పీఎస్ఎల్ మ్యాచ్‌లు

కెప్టెన్‌గానే కాకుండా బ్యాట‌ర్‌గానూ పంత్ ఘోరంగా విఫ‌లం అయ్యాడు. ఈ సీజ‌న్‌లో ఓ మ్యాచ్‌లో సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికి కూడా ఓవ‌రాల్‌గా చూసుకుంటే ప్ర‌ద‌ర్శ‌న నామ మాత్రంగానే ఉంది. 14 మ్యాచ్‌ల్లో 24.45 స‌గ‌టు, 133.17 స్ట్రైక్‌రేటుతో 269 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు.

పంత్‌ను ల‌క్నో వ‌దిలివేస్తుంద‌ని భావించగా..

జ‌ట్టు ఆట‌తీరుతో పాటు పంత్ వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఐపీఎల్ 2025 ముగిసిన వెంట‌నే పంత్‌ను ల‌క్నో వ‌దిలివేస్తుంద‌ని చాలా మంది భావించారు. అయితే.. ఐపీఎల్ 2026 మినీవేలాని కంటే ముందు అంద‌రికి షాకిస్తూ అత‌డిని ల‌క్నో జ‌ట్టు నిలుపుకుంది.

దీనిపై ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ య‌జ‌మాని సంజీవ్ గొయెంకా తాజాగా స్పందించాడు. పంత్‌ను జ‌ట్టు నుంచి తొల‌గించే ఉద్దేశం త‌న‌కు ఎన్న‌డూ లేద‌న్నాడు. ఓ కెప్టెన్ న‌లుగురు కీల‌క బౌల‌ర్ల సేవ‌ల‌ను కోల్పోతే అత‌డు మాత్రం ఏం చేయ‌గ‌ల‌డ‌ని ప్ర‌శ్నించాడు.’ కాబ‌ట్టి అత‌డి వ‌ద్ద వాస్త‌వంగా ఉన్న వ‌న‌రుల‌ను మ‌నం అంచ‌నా వేయాలి. పంత్ పై పూర్తి న‌మ్మ‌కం ఉంది. కొన్ని సార్లు రిష‌బ్‌ను తుది జ‌ట్టులోంచి తొల‌గిస్తారనే రూమ‌ర్లు వ‌చ్చాయి. వాటిని చూసి నేను న‌వ్వుకున్నాను. కొన్ని సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వ్యూస్ కోసం ఇలాంటి వాటిని పుట్టిస్తూ ఉంటాయి.’ అని గోయెంకా అన్నాడు.

Saina Nehwal : బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్‌.. బ్లాక్ డ్రెస్‌లో క్యూట్ ఫోటోలు..

‘అత‌డు అద్భుత‌మైన వాడు. అత‌డు సూటిగా, స్ప‌ష్టంగా ఉంటాడు. ఫ్రాంఛైజీ కోసం నూటికి నూరు శాతం ఇవ్వ‌డానికి కృషి చేస్తాడు. ఓ ఆట‌గాడు అత‌డు కెప్టెన్ కాక‌పోయిన‌ప్ప‌టికి కూడా ఫ్రాంచైజీ కోసం నూటికి నూరు శాతం కృషి చేస్తున్న‌ప్పుడు.. వాళ్ల నుంచి అంత‌కంటే ఎక్కువ ఆశించ‌డం స‌మంజ‌సం కాదు.’ అని గోయెంకా చెప్పాడు.