Pakistan Super League : ఇంధన సంక్షోభం.. ఖాళీ స్టేడియాల్లో పీఎస్ఎల్ మ్యాచ్‌లు
మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ (Pakistan Super League ) ప్రారంభం కానుంది.
West Asia crisis Pakistan Super League matchs in empty stadium
Pakistan Super League : మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభం కానుంది. అయితే.. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం పీఎస్ఎల్ పై పడింది. ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నఖ్వీ తెలిపారు.
చమురు సంక్షోభం కారణంగా పాక్ దేశంలో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మ్యాచ్‌లు చూసేందుకు వచ్చే ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ఈక్రమంలోనే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ టోర్నీ మొత్తం లాహోర్, కరాచీ మైదానాల్లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లుగా వివరించారు.
NZ vs SA : నాలుగో టీ20 మ్యాచ్‌లో కివీస్ పై దక్షిణాఫ్రికా విజయం.. రసకందాయంలో సిరీస్..
‘పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఇంధన సంకోభం తలెత్తింది. దీంతో పాక్ ప్రజలందరూ తమ రాకపోకలను పరిమితం చేసుకోవాలని ప్రధాని కోరారు. పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తరువాత ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం.’ అని నఖ్వీ తెలిపాడు.
10 నుంచి 15 రోజుల్లో ఈ సంక్షోభం ముగిసే అవకాశం ఉందని, ఆ తరువాత పీఎస్ఎల్ కు ప్రేక్షకులను అనుమతించే విషయం గురించి ఆలోచిస్తామన్నాడు. ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించడం వల్ల గేట్ రెవెన్యూలో ఫ్రాంచైజీలకు వచ్చే నష్టాన్ని పీసీబీ భర్తీ చేస్తుందన్నారు. అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో పెషావర్ స్టేడియం ఉండడంతో, ఇప్పుడున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ స్టేడియం నుంచి మ్యాచ్‌లను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఇలా చేస్తున్నందుకు ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పాడు.
