Sanju Samson : సంజూ శాంసన్ ఫోటోను ఎడిట్ చేసిన శుభ్‌మన్ గిల్..! మరి అంత అసూయ పనికిరాదయ్యా..?
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్ (Sanju Samson) కీలక పాత్ర పోషించాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 13, 2026 / 03:45 PM IST
Did Shubman Gill edit Sanju Samson out of T20 World Cup celebration photo
- పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్‌కు శుభాకాంక్షలు తెలిపిన గిల్
- గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో కనిపించని శాంసన్
- ఎడిట్ చేశారంటూ సోషల్ మీడియాలో రచ్చ
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. మార్చి8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.
కాగా.. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 గెలవడంలో సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్‌లో వెస్టిండీస్ పై 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిన అతడు ఆ తరువాత సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై 89 పరుగులు చేశాడు. ఇక కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై 89 రన్స్ సాధించాడు. ఈనేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును సంజూ గెలుచుకున్నాడు.
ఫోటో ఎడిట్ చేసిన గిల్..?
భారత జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో టెస్టు, వన్డే కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్ సోషల్ మీడియా వేదికగా టీమ్ఇండియాకు శుభాకాంక్షలు తెలియజేశాడు. భారత జట్టు ప్రపంచకప్‌తో దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే.. ఈ ఫోటో పైనే ప్రస్తుతం వివాదం నెలకొంది. గిల్ పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంసన్ కనిపించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే గిల్.. ఫోటోలో శాంసన్‌ను తీసివేశాడని కామెంట్లు పెడుతున్నారు.
IPL 2026 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, గ్యాస్ మంట.. ఐపీఎల్‌కు ఇబ్బందులు ఎన్నో?
Champions🏆🏆🏆🇮🇳🇮🇳 pic.twitter.com/viDQNN8ppQ
— Shubman Gill (@ShubmanGill) March 8, 2026
జట్టులో తన స్థానంలో సంజూ చోటు దక్కించుకోవడమే ఇందుకు కారణం అని మండిపడుతున్నారు. ఇక అదే రోజు సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ చేసిన ఫోటోలో సంజూ శాంసన్ కనిపించడాన్ని ప్రస్తావిస్తున్నారు. అదే ఫోటోను గిల్ ఎడిట్ చేసి పోస్ట్ చేశాడా? అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి శుభ్‌మన్ గిల్.. శాంసన్ ను ఫోటో నుంచి తొలగించే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే టీ20 ప్రపంచకప్2026 వేడుకల రోజున చాలా ఫోటోలు తీశారు. యశస్వి జైస్వాల్ కూడా భారత జట్టుకు అభినందలు తెలుపుతూ చేసిన ఫోటోలోనూ సంజూ లేడు. ఈ లెక్కన గిల్ ఫోటో ఎడిట్ చేసింది కాదని పలువురు చెబుతున్నారు.
