Dinesh Karthik : ముచ్చటగా మూడోసారి తండ్రైన దినేశ్ కార్తీక్.. కోహ్లీ ఏం మెసేజ్ చేశాడంటే?
- Thota Vamshi Kumar
- Published On : March 19, 2026 / 04:07 PM IST
Dinesh Karthik Dipika Pallikal blessed with 3rd child
- మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
- పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పల్లికల్
Dinesh Karthik : టీమ్ఇండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ మరోసారి తండ్రి అయ్యాడు. అతడి భార్య, స్క్వాష్ స్టార్ ప్లేయర్ దీపికా పల్లికల్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని దినేష్, దీపిక జోడీ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించింది. అంతేకాదండోయ్ తమ పాపకు రాహా అని పేరును పెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న సెలబ్రెటీలు, నెటిజన్లు దీపిక, కార్తీక్ లకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
విరాట్ కోహ్లీ, సానియా మీర్జా, శిఖర్ ధావన్ లు సైతం శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
2015 ఆగస్టు 18న దినేశ్ కార్తీక్, దీపికా పల్లికల్ లు పెళ్లి చేసుకున్నారు. వీరికి 2021లో కవల కుమారులు జన్మించారు. వారి పేర్లు కబీర్, జియాన్.
ఇదిలా ఉంటే.. క్రికెట్ కు వీడ్కోలు పలికిన కార్తీక్ ప్రస్తుతం కామెంటేటర్‌గా, కోచ్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మెంటర్‌గా, బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. దీపిక విషయానికి వస్తే.. ఆమె చివరిసారిగా అక్టోబర్ 2023లో జరిగిన హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది.
