Dinesh Karthik : ‘ఫ్లాప్ మూవీ ఇదీ.. చాలా ఇష్టం..’ ఇప్పుడెందుకు గుర్తుకు వచ్చింది డికే..!
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక మాధ్యమాల్లో మయా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు ఏదీ అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు.
- Thota Vamshi Kumar
- Published On : August 19, 2023 / 04:59 PM IST
Dinesh Karthik
Dinesh Karthik : టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు, క్రికెట్ వ్యాఖ్యత దినేశ్ కార్తీక్ (Dinesh Karthik) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాజిక మాధ్యమాల్లో మయా యాక్టివ్‌గా ఉంటాడు. తనకు ఏదీ అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తుంటాడు. ప్రస్తుతం ది హండ్రెడ్ సీజన్‌లో కామెంట్రీ చెబుతున్నాడు. తాజాగా అతడు గతంలో ట్విట్టర్ అని పిలిచే సోషల్ మీడియా హ్యాండిల్ ‘X’ లో ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అది ట్రెండింగ్‌లో ఉంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘ఫ్యాన్’ మూవీ పోస్టర్‌ను షేర్ చేశాడు. ఈ ఫ్లాప్ మూవీని రహస్యంగా ఎంతగానో ప్రేమిస్తున్నా అంటూ రాసుకొచ్చాడు. ఫ్యాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా తనకు బాగా నచ్చిందని డీకే చెప్పుకొచ్చాడు. IMDbలో ఈ సినిమాకు 6.9/10 రేటింగ్ ఉంది. కాగా.. ఎప్పుడో విడుదలైన ఈ సినిమాపై ఇప్పుడు డీకే ట్వీట్ చేయగా వైరల్‌గా మారింది.
Mohammad Naim : నిప్పుల పై నడిచిన క్రికెటర్.. దేని కోసమో తెలుసా..?
యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. మనీష్ శర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్నా ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, సాయాని గుప్తా, శ్రియా పిల్గొంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. షారుఖ్ ఖాన్ ద్విపాత్రిభినయం చేసిన ఈ సినిమాను దాదాపు రూ.120 కోట్ల బడ్జెట్‌తో తెరకెకెక్కించారు. 2016 ఏప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.182.33 కోట్లు వసూలు చేసింది. భారత దేశంలో రూ.116.81కోట్లు, ఓవర్సీస్‌లో 65.52 కోట్లు రాబట్టింది.
ఇదిలా ఉంటే.. గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ తరువాత దినేశ్ కార్తీక్ టీమ్ఇండియా తరుపున ఇప్పటి వరకు మరో మ్యాచ్ ఆడలేదు. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న ఈ 38 ఏళ్ల ఆటగాడు ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన డీకే.. 11.67 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో వచ్చే సీజన్‌ను అతడిని విడిచి పెట్టే ఆలోచనలో ఆర్‌సీబీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Rinku Singh : కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో రింకూ సింగ్‌పై ప్రశ్న.. సమాధానం చెబితే 6 లక్షల 40 వేలు
ఐపీఎల్‌లో కార్తీక్ ఇప్పటి వరకు 242 మ్యాచులు ఆడాడు. 25.81 సగటుతో4,516 పరుగులు చేశాడు. 20 హాఫ్ సెంచరీలు కూడా అతడి పేరిట ఉన్నాయి. అత్యధిక స్కోరు 97. టీమ్ఇండియా తరుపున 26 టెస్టులు, 94 వన్డేలు, 56 టీ20ల్లో ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి మూడు వేల పై చిలుకు పరుగులు సాధించాడు.
A flop movie that I secretly loved ? pic.twitter.com/b2Hk1IRKqJ
— DK (@DineshKarthik) August 18, 2023
