Viral Video : డూప్లికేట్ ప్రీమియర్ లీగ్.. ధోని, కోహ్లి, సచిన్‌ల మధ్య చర్చ.. వీడియో వైరల్
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- February 28, 2024 / 02:19 PM IST
Duplicate Premier League
Viral Video : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరగనుంది. ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఐపీఎల్ 2024 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇటీవల బీసీసీఐ విడుదల చేసింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పూర్తి షెడ్యూల్‌ను కాకుండా మొదటి రెండు వారాల షెడ్యూల్‌ను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత మొత్తం షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు బీసీసీఐ ఇప్పటికే వెల్లడించింది.
Suresh Raina : రైనా సిక్సర్ల వర్షం.. చూసి ఎన్నాళ్లయిందో..!
అయితే.. ప్రముఖ క్రికెటర్లు అందరికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో క్రికెట్ గ్రౌండ్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్‌ల డూప్‌లు కనిపిస్తున్నారు. ఇది నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. కొందరు దీనిని డూప్లికేట్ ప్రీమియర్ లీగ్ అని పిలుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ సిరీస్‌కు దూరం అయిన విరాట్ కోహ్లి ఐపీఎల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది.
