Tilak Varma : న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్.. తిలక్ వర్మను ఊరిస్తున్న భారీ మైలురాయి..
న్యూజిలాండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు తిలక్ వర్మను (Tilak Varma) ఓ మైలురాయి ఊరిస్తోంది.
IND vs NZ 3rd T20 Tilak Varma Need 6 More To Complete 100 Sixes In International T20s
Tilak Varma : వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు మూడో టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ 6 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
అంతేకాదండోయ్.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని దాటిన ఏడో భారత ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్‌లు మాత్రమే భారత్ తరుపున టీ20ల్లో 100 సిక్సర్లు బాదారు.
ఇక తిలక్ వర్మ విషయానికి వస్తే.. 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటి వరకు 72 టీ20 మ్యాచ్‌లు ఆడి 44.7 సగటుతో 1898 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 11 అర్థశతకాలు ఉన్నాయి. 146 ఫోర్లు, 94 సిక్సర్లు బాదాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్లు కొట్టిన భారత ఆటగాళ్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 69 మ్యాచ్‌ల్లో 147 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 79 మ్యాచ్‌ల్లో 108 సిక్సర్లు
మొదటి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది.
