×
Ad

T20 World Cup : ఎంత మంది భార‌త క్రికెట‌ర్లు తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ ఆడ‌నున్నారో తెలుసా?

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ (T20 World Cup) 2026లో భాగంగా ఆదివారం భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Do you know How many India cricketers will play their first T20 World Cup final

ఆదివారం భార‌త్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌
తొలిసారి 6 గురు భార‌త ప్లేయ‌ర్లు ఫైన‌ల్ కు
వీరిలో ఎంత మంది తుది జ‌ట్టులో ఉంటారంటే?

T20 World Cup : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా ఆదివారం భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వ‌నుంది. తొలి సెమీఫైన‌ల్‌లో ద‌క్షిణాఫ్రికాను ఓడించి కివీస్, రెండో సెమీఫైన‌ల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి భార‌త్ ఫైన‌ల్‌కు చేరుకున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచి తొలిసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌ని కివీస్ ఆరాట‌ప‌డుతుండ‌గా.. వ‌రుస‌గా రెండోసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టించాల‌ని భార‌త్ క‌ల‌లు కంటోంది.

ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుత భార‌త జ‌ట్టులో ఆరుగురు ఆట‌గాళ్లు తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నున్నారు. ఇషాన్ కిష‌న్, అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, రింకూ సింగ్, వాషింగ్ట‌న్ సుంద‌ర్, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తిలు తొలిసారి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో చోటు సంపాదించుకున్నారు. వీరిలో రింకూ సింగ్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024లో రిజ‌ర్వ్ ఆట‌గాడిగా ఉన్నాడు.

IND vs NZ : ఫైన‌ల్ మ్యాచ్‌కు ఎలాంటి పిచ్‌ను వాడుతున్నారో తెలుసా? ద‌క్షిణాఫ్రికాపై ఓడిపోయింది ఇక్క‌డే.. అదే పిచ్ పై ఆడ‌డం లేదుకదా?

అయితే.. ఈ ఆరుగురిలో న‌లుగురు ఆట‌గాళ్లు మాత్ర‌మే తుది జ‌ట్టులో ఆడే అవ‌కాశం ఉంది. వెస్టిండీస్ పై 97 నాటౌట్‌, సెమీస్‌లో ఇంగ్లాండ్ పై 89 ప‌రుగులు చేసిన సంజూ శాంస‌న్ ఓ ఓపెన‌ర్‌గా రావ‌డం ఖాయం. గ‌త కొంత‌కాలంగా పేల‌వ ఫామ్‌తో ఇబ్బంది ప‌డుతున్నప్ప‌టికి కూడా అభిషేక్ శ‌ర్మ‌కు మేనేజ్‌మెంట్ మ‌ద్ద‌తు ఉండ‌డంతో అత‌డు మ‌రో ఓపెన‌ర్‌గా ఆడ‌నున్నాడు. వ‌న్‌డౌన్‌లో ఇషాన్ కిష‌న్ తన స్థానాన్ని నిలుపుకుంటాడు.

గ‌త రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫ‌ల‌మైన‌ప్ప‌టికి వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి స్థానానికి డోకా లేన‌ట్లుగా తెలుస్తోంది. ఆరో స్థానంలో తిల‌క్ వ‌ర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. అత‌డికి చోటు ప‌క్కానే. ఇక రింకూ సింగ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ల‌కు తుది జ‌ట్టులో చోటు క‌ష్ట‌మే.