FIFA World Cup : 1994లో అమెరికాలో నిర్వ‌హించిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర ఎంతో తెలుసా? అప్ప‌టికి ఇప్ప‌టికి ఎంత తేడా అంటే?

1994 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌తో పోలిస్తే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ ధ‌ర‌లు (FIFA World Cup) ఆకాశాన్ని అంటాయి.

Do you know how much FIFA World Cup 1994 ticket price

FIFA World Cup : ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 నేటి (జూన్ 11) నుంచి ప్రారంభం కానుంది. అమెరికా, కెన‌డా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీ జూలై 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. మొత్తం 48 జ‌ట్లు క‌ప్పుకోసం పోటీప‌డ‌నుండ‌గా 104 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక మ్యాచ్‌లు జ‌రుగుతున్న టోర్నీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచ‌నా ప్ర‌కారం సుమారు 6.5 మిలియ‌న్ల మంది ప్ర‌త్య‌క్షంగా స్టేడియాల్లో మ్యాచ్‌లు వీక్షించే అవ‌కాశం ఉండ‌గా.. దాదాపు 6 బిలియ‌న్ల మంది టీవీ, డిజిట‌ల్ స్ట్రీమింగ్‌ల ద్వారా వీక్షించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది.

ఈ టోర్నీ ప‌రిమాణం పెరిగిన‌ట్లుగానే టికెట్ల ధ‌ర‌లు కూడా ఆకాశాన్ని తాకాయి. 1994లో అమెరికాలో జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్‌లో గ్రూప్ ద‌శ టికెట్ల ధ‌ర 25 నుంచి 75 డాల‌ర్ల మ‌ధ్య ఉండ‌గా.. ఫైన‌ల్ మ్యాచ్‌కు 180 నుంచి 475 డాల‌ర్ల వ‌ర‌కు ఉండేవి. అయితే.. ఇప్పుడు అమెరికా ఆతిథ్యం ఇస్తున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 టికెట్ ధ‌ర‌లు సామాన్యుల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి.

FIFA World Cup Free: ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఇండియాలో ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఇలా చూడొచ్చు..

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 టోర్నీలో గ్రూప్ ద‌శ మ్యాచ్‌ల టికెట్ల ధ‌ర 140 డాల‌ర్ల నుంచి 2735 డాల‌ర్ల వ‌ర‌కు ఉన్నాయి. ఇక ఫైన‌ల్ మ్యాచ్ టికెట్ల ధ‌ర‌లు అయితే మొద‌ట్లో 4185 నుంచి 8680 డాల‌ర్ల మ‌ధ్య ఉండేవి. కానీ ఏప్రిల్‌లో ఫిఫా అత్య‌ధిక ధ‌ర కేట‌గిరి ధ‌ర‌ను 10990 డాల‌ర్లగా నిర్ణ‌యించింది.

ఈ నాటకీయమైన పెరుగుదల గత 32 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచ క్రీడల ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ప్రాథమిక మార్పును కూడా ప్రతిబింబిస్తుంది. ఈ సారి ధ‌ర‌లు ఇంత‌లా పెర‌గ‌డానికి కార‌ణం “డైన‌మిక్ ప్రైసింగ్” విధానం. దీన్ని తొలిసారిగా ఫిపా ప్ర‌వేశ‌పెట్టింది. డిమాండ్‌ను బట్టి టికెట్ ధరలను మార్చుకునే ఈ విధానం ఇప్పటికే విమానయాన, హోటల్, వినోద రంగాల్లో అమలులో ఉంది. అత్యధిక ఆదాయం సాధించేందుకు ఫిఫా కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంది.

1996లో ఉప‌యోగించిన అనేక వేదిక‌ల‌కు భిన్నంగా 2026 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్న 11 అమెరికా స్టేడియాలు అత్యాధునిక సౌకర్యాలు, లగ్జరీ సూట్లు, ప్రత్యేక అతిథ్య సేవలతో సిద్ధంగా ఉన్నాయి. దీంతో ఆదాయం గణనీయంగా పెరగనున్నప్పటికీ, సాధారణ అభిమానులకు మ్యాచ్‌లు ప్రత్యక్షంగా వీక్షించడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. ముఖ్యంగా ఫైనల్ వంటి ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌లకు భారీ ధరలు ఉండటంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Vaibhav Sooryavanshi : అఫ్గాన్‌పై దుమ్ములేపిన వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఉన్నంత సేపు ఊపాడు గానీ..

500 డాలర్ల లోపే ముగిసిన ఒకప్పటి ఫైనల్ మ్యాచ్.. నేడు 11 వేల డాలర్లకు చేరడం ఆధునిక క్రీడా ప్రపంచంలో వాణిజ్య ధోరణులకు నిదర్శనంగా నిలుస్తోంది.