Womens Asia Cup 2026 : నేటి నుంచి మహిళల ఆసియాకప్ 2026.. ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
నేటి (ఆగస్టు 28 శుక్రవారం) నుంచి మహిళల ఆసియా కప్ 2026 (Womens Asia Cup 2026) ప్రారంభం కానుంది.
- Thota Vamshi Kumar
- Updated on- August 28, 2026 / 01:07 PM IST
Do you know When and where to watch Womens Asia Cup 2026 matchs
Womens Asia Cup 2026 : నేటి (ఆగస్టు 28 శుక్రవారం) నుంచి మహిళల ఆసియా కప్ 2026 ప్రారంభం కానుంది. 8 జట్లు కప్పు కోసం పోటీపడుతుండగా ఈ మెగా టోర్నీకి దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. గ్రూప్-ఏలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌తో పాటు థాయ్‌లాండ్. హాంకాంగ్ చైనాలు ఉన్నాయి. గ్రూప్-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేసియాలు ఉన్నాయి.
తొలి మ్యాచ్‌లో హాంకాంగ్ మహిళల జట్టు, థాయిలాండ్ మహిళల జట్టుతో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 30న థాయ్‌లాండ్‌తో ఆడనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 3న హాంకాంగ్ చైనాతో తలపడనుంది. ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 5న జరగనుంది.
R Praggnanandhaa : చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన ఏకైక భారతీయుడు..
గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తొలి సెమీఫైనల్ సెప్టెంబర్ 10న, రెండో సెమీఫైనల్ సెప్టెంబర్ 11న జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది.
ఎక్కడ చూడొచ్చంటే?
మహిళల ఆసియా కప్ 2026 ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ దక్కించుకుంది. దీంతో టీవీల్లో మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్‌లో వీక్షించవచ్చు. ఇక ఓటీటీ విషయానికి వస్తే.. సోనీలివ్, వైబ్‌సైట్‌లలో స్ట్రీమింగ్ కానుంది.
టీమ్ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
* ఆగస్టు 30న – థాయ్‌లాండ్‌తో
* సెప్టెంబర్ 3న – హాంకాంగ్ చైనాతో
* సెప్టెంబర్ 5న – పాకిస్థాన్‌తో
