Vaibhav Sooryavanshi : నువ్వు తోపు బ్రో..! వైభ‌వ్‌ను ముప్పు తిప్ప‌లు పెట్టిన బౌల‌ర్ ఎవ‌రో తెలుసా? మెయిడెన్ ఓవ‌ర్‌..

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ (Vaibhav Sooryavanshi) ధాటికి దిగ్గ‌జ బౌల‌ర్లు సైతం భ‌య‌ప‌డుతున్నారు.

Do you know who bowls first ever maiden to Vaibhav Sooryavanshi and dismisses him

Vaibhav Sooryavanshi : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ యువ ఓపెన‌ర్‌, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీ ధాటికి దిగ్గ‌జ బౌల‌ర్లు సైతం భ‌య‌ప‌డుతున్నారు. అత‌డిని ఔట్ చేయ‌డం అటు ఉంచితే క‌నీసం ప‌రుగులు రాకుండా చేయ‌డం కూడా స‌వాల్ మారుతుంది. అత‌డి ధాటికి భారీగా ప‌రుగులు స‌మ‌ర్పించుకుంటున్నారు కూడా.

200 పైగా స్ట్రైక్ రేటుతో ప‌రుగులు రాబ‌డుతున్న అత‌డిని ఆప‌డం చాలా మంది బౌల‌ర్ల‌కు సాధ్య‌ప‌డ‌డం లేదు. అయితే.. ఓ బౌల‌ర్ మాత్రం వైభ‌వ్ ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఎక్క‌డో కాదు ఈ ఐపీఎల్ సీజ‌న్‌లోనే. మిగిలిన బౌల‌ర్లు అంద‌రి బౌలింగ్‌లో సిక్స‌ర్లు, ఫోర్ల‌తో విరుచుకుప‌డిన సూర్య వంశీ ఆ ల‌క్నో బౌల‌ర్ ముందు తేలిపోయాడు. ఆ బౌల‌ర్ బౌలింగ్‌లో క‌నీసం సింగిల్ కూడా తీయ‌లేక‌పోయాడు. అంతేకాదండోయ్ అత‌డి బౌలింగ్‌లోనే వికెట్ స‌మ‌ర్పించుకున్నాడు. ఆ బౌల‌ర్ మ‌రెవ‌రో కాదు మొహ్సిన్ ఖాన్.

Vaibhav Sooryavanshi : గుజ‌రాత్ పై వైభ‌వ్ సూర్య‌వంశీ 68 ప‌రుగులు చేస్తే.. మ‌రో చ‌రిత్ర‌..

ఏప్రిల్ 22 న ల‌క్నోలోని ఎకానా స్టేడియంలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఇన్నింగ్స్ 4 ఓవ‌ర్‌ను మొహ్సిన్ ఖాన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని తొలి 5 బంతుల్లో వైభ‌వ్ ప‌రుగులు రాబ‌ట్ట‌లేక‌పోయాడు. క‌నీసం సింగిల్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఇక ఆఖ‌రి బంతి భారీ షాట్ ఆడ‌బోయి దిగ్వేశ్ రాఠి క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

ఈ ఓవ‌ర్‌లో ప‌రుగులు ఏమీ ఇవ్వ‌ని మొహ్సిన్ ఖాన్ వికెట్ తీశాడు. దీంతో వైభ‌వ్‌కు తొలి మెయిడిన్ ఓవ‌ర్ వేసిన బౌల‌ర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో రాజ‌స్థాన్ 40 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

Jofra Archer : వైభ‌వ్‌ను ఎలా ఆపాలో నాకు తెలుసు.. ఎలాగంటే.. జోఫ్రా ఆర్చ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఎలిమినేట‌ర్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 29 బంతుల్లోనే వైభ‌వ్ 97 పరుగులు చేసిన నేప‌థ్యంలో మ‌రోసారి మొహ్సిన్ ఖాన్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చాడు.