Ben Stokes : బెన్‌స్టోక్స్‌కు బిగ్ షాకిచ్చిన ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.. టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా జోరూట్.. కారణమిదే?
Ben Stokes : ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. న్యూజిలాండ్ తో రెండో టెస్టు కు అతన్ని ఎంపిక చేయలేదు. జోరూట్ కు తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
- Harish Thanniru
- Published on- June 10, 2026 / 10:34 PM IST
Ben Stokes
Ben Stokes : ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ బెన్‌స్టోక్స్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. జూన్ 17 నుంచి 21 మధ్య ఓవెల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న రెండో టుస్టు నుంచి బెన్‌స్టోక్స్‌ను తప్పించింది. దీంతో సీనియర్ బ్యాటర్ జోరూట్ ఇంగ్లాండ్ తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
బెన్‌స్టోక్స్ ఇటీవల మద్యం మత్తులో నైట్ క్లబ్ లో ఓ రగ్బీ ప్లేయర్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీరియస్ గా తీసుకుంది. బెన్‌స్టోక్స్‌తో పాటు గస్ అట్కిన్సన్ కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. వారిద్దరిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే, కొత్తగా జట్టులోకి జోఫ్రా ఆర్చర్, జార్డన్ కాక్ చేరనున్నారు. ఐపీఎల్ తర్వాత ఆర్చర్ తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
బెన్‌స్టోక్స్ మద్యం కారణంగా ఇబ్బందుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. అతిగా మద్యం సేవించిన కారణంగా 2013లో అతడిని సిరీస్ నుంచి అర్ధంతరంగా తప్పించారు. 2017లో బ్రిస్టల్ నైట్‌క్లబ్‌లో గొడవ కారణంగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆత్మరక్షణ కోసమే తాను దాడి చేయాల్సివచ్చిందని చెప్పిన అతడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇంగ్లాండ్ జట్టు..
జో రూట్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), సోన్నీ బేకర్, షోయబ్ బషీర్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, మాథ్యూ ఫిషర్, ఎమిలియో గే, జేమ్స్ ర్యూ, ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్
మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. ఇప్పటికే తొలి టెస్టు పూర్తయింది. ఇంగ్లాండ్ జట్టు 115 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్ 1-0 తేదీతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ లో రెండో టెస్టు జూన్ 17వ తేదీ నుంచి కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మొదలు కానుంది.
