Jos Buttler : ఆస్ప‌త్రిలో ఇంగ్లాండ్ స్టార్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్‌.. ఇప్ప‌ట్లో క్రికెట్ ఆడడం క‌ష్ట‌మేనా! అస‌లేం జ‌రిగింది?

Jos Buttler : ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ ఆస్ప‌త్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.

England star player Jos Buttler Posts Photo From Hospital Bed

Jos Buttler : ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాడు జోస్ బ‌ట్ల‌ర్ ఆస్ప‌త్రి బెడ్‌పై ఉన్న ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. శ‌స్త్ర చికిత్స విజ‌య‌వంతంగా పూర్తి అయింద‌ని చెప్పుకొచ్చాడు. ఈ ఫోటో వైర‌ల్‌గా మారాగా.. అత‌డి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అత‌డి ఏం జ‌రిగింద‌ని ఆరా తీస్తున్నారు.

అస‌లేం జ‌రిగిందంటే?

గ‌త నెల‌లో శ్రీలంక‌తో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా జోస్ బ‌ట్ల‌ర్ గాయ‌ప‌డ్డాడు. సెప్టెంబ‌ర్ 24న హెడింగ్లీలో జరిగిన రెండో వన్డేలో ఈ రైట్ హ్యాండ్ ఆట‌గాడు తొడ కండ‌రాల గాయానికి గురి అయ్యాడు. గాయం కార‌ణంగా మైదానాన్ని వీడాడు. అయితే.. కొద్ది సేప‌టికే తిరిగి వ‌చ్చి బ్యాటింగ్ కొన‌సాగించాడు. నొప్పిని భ‌రిస్తూనే.. 49 బంతుల్లో ఐదు సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. అయిన‌ప్ప‌టికి కూడా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడిపోయింది. ఆ త‌రువాత అత‌డు మిగిలిన వ‌న్డేల‌కు దూరం అయ్యాడు.

Sanju Samson : ఉప్ప‌ల్‌లో బుధ‌వారం వెస్టిండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌.. భారీ మైలురాయి పై సంజూ శాంస‌న్ క‌న్ను..

తాజాగా ఎడమ తొడ కండరాల గాయానికి బ‌ట్ల‌ర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఆసుపత్రి బెడ్‌పై నుంచి బొటనవేలు పైకెత్తి చూపిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా జ‌రిగింద‌ని, గాయం నుంచి పూర్తిగా కోలుకుని మరింత పట్టుదలతో మైదానంలోకి తిరిగి వ‌స్తాన‌న్న‌ ధీమా వ్యక్తం చేశాడు.

అత‌డు కోలుకునేందుకు చాలా స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో పాకిస్థాన్‌లో జ‌ర‌గ‌నున్న ట్రై సిరీస్‌కు దూరం అయ్యాడు. అంతేకాదండోయ్ న‌వ‌బంర్‌లో ఆస్ట్రేలియాలో జ‌ర‌గ‌నున్న ఇంగ్లాండ్ వైట్‌బాల్ పర్యటనకు కూడా అతడు దూరమయ్యే అవకాశముందని అంటున్నారు.

ఈ ఏడాదిలో అత‌డు ఆడ‌డం క‌ష్ట‌మేన‌ని, వ‌చ్చే ఏడాదే అత‌డు ఆడే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

Tilak Varma : సొంత గ‌డ్డ ఉప్ప‌ల్‌లో తిల‌క్ వ‌ర్మ.. శ‌త‌క సిక్స‌ర్ల రికార్డు అందుకునేనా ?

ఇటీవలి కాలంలో భీక‌ర ఫామ్‌లో ఉన్న బట్లర్‌కు ఈ గాయం ఎదురుదెబ్బగా మారింది. భార‌త్‌లో జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో విఫ‌ల‌మైన అనంత‌రం.. అత‌డు ఆడిన 9 మ్యాచుల్లోనే 466 ప‌రుగులు సాధించాడు. మరోవైపు.. సోమవారం బట్లర్‌తో పాటు సీనియర్ ఆటగాడు ఆదిల్ రషీద్‌కు కూడా ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మ‌రో ఏడాది కాంట్రాక్టును పొడిగించింది.