Tilak Varma : సొంత గడ్డ ఉప్పల్‌లో తిలక్ వర్మ.. శతక సిక్సర్ల రికార్డు అందుకునేనా ?
ఉప్పల్‌లో విండీస్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు తెలుగు తేజం తిలక్ వర్మను (Tilak Varma) ఓ భారీ మైలురాయి ఊరిస్తోంది.
IND vs WI 4th T20 Tilak Varma eye on massive record in Home stadium uppal
Tilak Varma : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం ఉప్పల్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు, తెలుగు తేజం తిలక్ వర్మను (Tilak Varma) ఓ మైలురాయి ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో తిలక్ 10 సిక్సర్లను గనుక కొట్టగలిగితే.. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకుంటాడు.
హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మకు ఉప్పల్ సొంత మైదానం అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాలుగో టీ20 మ్యాచ్‌లో అతడు చెలరేగి ఆడాలని 100 సిక్సర్ల మైలురాయిని ఉప్పల్లోనే అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
తిలక్ వర్మ 2023లో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అరంగ్రేటం చేశాడు. 68 మ్యాచ్‌ల్లో 44.8 సగటుతో 1791 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 138 ఫోర్లు, 90 సిక్సర్లు బాదాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఐదుగురు భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు మాత్రమే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో వంద సిక్సర్ల మైలురాయిని దాటారు. తిలక్ ఈ మైలురాయిని చేరుకుంటే ఆరో ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్లు..
* రోహిత్ శర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్సర్లు
* సూర్యకుమార్ యాదవ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్సర్లు
* అభిషేక్ శర్మ – 65 మ్యాచ్‌ల్లో 141 సిక్సర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్సర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్సర్లు
* కేఎల్ రాహుల్ – 72 మ్యాచ్‌ల్లో 99 సిక్సర్లు
* సంజూ శాంసన్ – 75 మ్యాచ్‌ల్లో 98 సిక్సర్లు
* తిలక్ వర్మ – 68 మ్యాచ్‌ల్లో 90 సిక్సర్లు
