Panipat : చరిత్ర సృష్టించిన చోప్రా, సొంత గ్రామంలో సంబరాలు

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రోలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత పతకం లభించింది. 2008 ఒలింపిక్స్ తర్వాత భారత్‌ స్వర్ణం సాధించింది ఇప్పుడే.

India

Neeraj Chopra In Panipat : టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్‌ త్రోలో భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత పతకం లభించింది. 2008 ఒలింపిక్స్ తర్వాత భారత్‌ స్వర్ణం సాధించింది ఇప్పుడే. షూటింగ్‌లో అభినవ్ బింద్రా కాంస్యం గెలుచుకున్నాడు. మళ్లీ ఇన్నాళ్లుకు నీరజ్ చోప్రా కోట్లాది భారతీయుల కల నెరవేర్చాడు. 2021, ఆగస్టు 07వ తేదీ శనివారం జరిగిన మ్యాచ్ లో నీరజ్ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణం సాధించాడు.

Read More : Tokyo Olympics 2020: స్వర్ణంతో ముగించి సప్త పతకాలతో భారత్

నీరజ్ చోప్రా స్వస్థలం హర్యానాలో సంబరాలు మిన్నంటాయి. హర్యానా దేశానికి ఒలింపిక్స్‌లో రెండు పతకాలు అందించింది. హర్యానాకు చెందిన భజరంగ్ పునియా రెజ్లింగ్‌లో కాంస్యం సాధించగా నీరజ్..స్వర్ణం గెలుచుకున్నాడు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు దక్కాయి. 65 కేజీల విభాగంలో బజరంగ్ పునియా కాంస్యం గెలుచుకున్నాడు. రెజ్లింగ్‌లోనే భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.

Read More : Tokyo Olympics 2020: ఇండియాకు తొలి స్వర్ణం.. పసిడి కొట్టిన నీరజ్

57 కిలోల విభాగంలో రవికుమార్ దహియాకు రజతం దక్కగా.. భజరంగ్ 65 కిలోల విభాగంలో కాంస్యం దక్కించుకున్నాడు. టోక్యోలో తొలి పతకం మీరాబాయ్ చానుకు దక్కింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో చాను రజతం సాధించింది. ఆ తర్వాత తెలుగు తేజం సింధు బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలుచుకుంది. పురుషుల హాకీ జట్టు…జర్మనీపై గెలిచి 41 ఏళ్ల తర్వాత కాంస్యం గెలుచుకుంది. అసోంకు చెందిన లవ్లీనా కాంస్యం గెలుచుకుంది. ఇప్పుడు నీరజ్ చోప్రా స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.